మారికో లిమిటెడ్​కు లాభం రూ. 320 కోట్లు

మారికో లిమిటెడ్​కు లాభం రూ. 320 కోట్లు

న్యూఢిల్లీ: దేశీయ ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎంసీజీ కంపెనీ మారికో లిమిటెడ్​కు మార్చి 2024తో ముగిసిన నాలుగో క్వార్టర్​లో ఏకీకృత నికర లాభం 4.9 శాతం పెరిగి రూ.320 కోట్లకు చేరుకుంది.  గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్​లో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ. 305 కోట్లుగా నమోదు చేసిందని మారికో రెగ్యులేటరీ ఫైలింగ్‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది. సమీక్షిస్తున్న క్వార్టర్​లో కార్యకలాపాల ద్వారా ఏకీకృత ఆదాయం రూ. 2,278 కోట్లుగా ఉంది, ఇది క్రితం ఏడాది కాలంలో రూ.2,240 కోట్లుగా ఉంది. 

నాలుగో  క్వార్టర్​లో మొత్తం ఖర్చులు ఏడాది క్రితం రూ.1,907 కోట్లతో పోలిస్తే రూ.1,894 కోట్లకు తగ్గాయని కంపెనీ తెలిపింది.  మారికో తన ఏకీకృత నికర లాభం 2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,322 కోట్లు కాగా, గత ఆర్థిక సంవత్సరంలో 13.62 శాతం పెరిగి రూ. 1,502 కోట్లకు చేరుకుంది. 2024 ఆర్థిక సంవత్సరం కార్యకలాపాల ద్వారా ఏకీకృత ఆదాయం రూ.9,653 కోట్లుగా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.9,764 కోట్లుగా ఉంది.