‘గురక’ ఎన్నో అనారోగ్య సమస్యలకు సూచిక.. లైట్ తీసుకుంటే గుండెకు ప్రమాదం

‘గురక’  ఎన్నో అనారోగ్య సమస్యలకు సూచిక.. లైట్ తీసుకుంటే గుండెకు ప్రమాదం
గురక సాల్వ్ కాని ప్రాబ్లం ఏమీ కాదు. అలాగని లైట్​ తీసుకునేదీ కాదు. మనకు తెలిసినంత వరకు నిద్రపోతున్నప్పుడు రెస్పిరేటరీ సిస్టమ్​లో ఏదైనా అడ్డంకి ఉంటే గురక వస్తుంది. అంటే జలుబు, సైనస్ వల్ల ముక్కు రంధ్రాలు జామ్ అవుతాయి. అలాంటప్పుడు ముక్కునుంచి గాలి సరిగ్గా తీసుకోలేక నోటినుంచి శ్వాస తీసుకునే ప్రయత్నం చేస్తాం. అప్పుడు శ్వాస మార్గంలో ఉండే టిష్యూలు కదిలి గురక వస్తుంది. మామూలుగా అయితే మనకు తెలిసింది ఇంతవరకే.  కానీ, గురక వెనక చాలా కారణాలు ఉంటాయి.  ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్‌‌‌‌‌‌‌‌ని గురక వల్ల ముందుగానే తెలుసుకోవచ్చు.   సమస్యగా మారకముందే వయసు పెరిగే కొద్దీ గొంతు భాగం కొద్దిగా ముడుచుకుపోతూ ఉంటుంది. దీనివల్ల మిడిలేజ్ లో గురక సాధారణమే. అయితే వయసుతో సంబంధం లేకుండా వచ్చే గురకకి ముక్కులోపలి భాగం వాచిపోవడం, అలర్జీలు, సైనస్ ఇన్ఫెక్షన్స్, అడినాయిడ్స్ చాలావరకు ఇవే కారణం అవుతాయి. సైనస్ ఉన్నప్పుడు నాసల్ క్యావిటీస్ జామ్ అవుతాయి. దీనివల్ల గాలి సాఫీగా వెళ్లే వీలుండదు. దీనివల్ల గురక మరీ గట్టిగా వినిపిస్తుంది. కొన్ని సార్లు పక్కవాళ్ల నిద్ర కూడా డిస్టర్బ్ అయ్యేంత సౌండ్ వస్తుంది. పడుకునే పొజిషన్ సరిగా లేకున్నా గురక వస్తుంది.  అయితే ఇవి ఈజీగానే తగ్గిపోయే సమస్యలు. గురక మొదలైన మొదట్లోనే డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని కలిస్తే చాలు. ఇబ్బంది పెట్టే సమస్యగా మారకముందే తగ్గించుకోవచ్చు. ఒబెసిటీ బాడీ వెయిట్ కంట్రోల్‌‌‌‌‌‌‌‌లో ఉండాలి. బరువు పెరుగుతుంటే గురక వచ్చే అవకాశం పెరుగుతుంది. ఒబెసిటీవల్ల మెడ, గొంతు భాగంలో ఒత్తిడి పడుతుంది. దీని వల్ల గురక వస్తుంది. మినిమం ఎక్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌‌‌‌‌తో బరువుని కంట్రోల్ లో ఉంచుకుంటే గురక కూడా తగ్గిపోతుంది. అలవాట్లు, మెడికేషన్ స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి అలవాట్లు, ట్రాంక్విలైజర్స్ వాడాల్సి రావటం వల్ల కూడా గురక వచ్చే అవకాశం ఉంది. డైజీఫామ్​లాంటి ట్రాంక్విలైజర్స్ ఎక్కువ కాలం వాడాల్సి రావటం కూడా గురకకి కారణం అవుతుంది. గురక మరీ ఎక్కువ అనిపిస్తే డాక్టర్​కి చెప్పటం మంచిది. స్లీప్ ఆప్నియా గురక ఎక్కువ రోజులు ఉంటే స్లీప్ ఆప్నియా అనే స్టేజ్ కి వెళుతుంది. గురక వల్ల నిద్ర  సరిగా ఉండదు సరైన నిద్ర లేక పోవటం, డిస్టర్బ్డ్  స్లీప్, గాఢ నిద్ర ఉండకపోవటం స్లీప్ ఆప్నియాలో కనిపిస్తాయి. అంతే కాదు గురక క్రానిక్ గా ఉంటే బీపీ పెరిగే అవకాశం ఉంది. హార్ట్ ఎన్ లార్జ్ మెంట్, హార్ట్ ఎటాక్ లాంటి పెద్ద సమస్యలకు దారి తీయొచ్చు. గుండెకు ప్రమాదం గురక వస్తోందంటే శ్వాస సరిగా అందటం లేదని అర్థం. శ్వాస ఆడకపోతే కావాల్సిన ఆక్సిజన్ అందదు. దానివల్ల పల్మనరీ హైపర్ టెన్షన్, తలనొప్పి, ఒబెసిటీ, ఒళ్లునొప్పులు, పగలు నిద్రరావటం, ఏ పనిమీదా కాన్సంట్రేషన్ లేకపోవటం లాంటి సమస్యలు వస్తాయి. గురక చాలా పెద్ద శబ్దంతో వస్తూ, పగలంతా మత్తుగా, స్లీపీ మూడ్‌‌‌‌‌‌‌‌లోనే ఉంటుంటే దాన్ని  స్లీప్ ఆప్నియా అనుకోవచ్చు. స్లీప్ ఆప్నియా వల్ల గుండె ప్రమాదంలో పడే అవకాశాలే ఎక్కువ. స్లీప్ ఆప్నియాగా మారకముందే జాగ్రత్త పడాలి  రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా గురక రావటానికి కారణం జలుబు, రెస్పిరేటరీ ఇబ్బంది ఉన్నవాళ్లలో గురక కనిపిస్తుంది. లేదంటే ఒబెసిటీ కంట్రోల్‌‌‌‌‌‌‌‌లో లేక పోవటం, హైపో థైరాయిడ్ (లో– మెటబాలిజం ఉండటం) లాంటి సమస్యలు ఉన్నవాళ్లలో కూడా గురక క్రానిక్ సమస్యగా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ గురక సమస్య వస్తుంది. వయసు పెరుగుతుంటే మజిల్స్​లో పట్టు తగ్గిపోతుంది. దానివల్ల గాఢ నిద్రలో ఉన్నప్పుడు శ్వాస మార్గాలలో ఉండే మజిల్స్ ఫ్రీ అయ్యి గాలిని అడ్డుకుంటాయి. అప్పుడు నోటినుంచి గాలి తీసుకోవటం వల్ల కూడా గురక పెరుగుతుంది. ఎక్కువ గురక వచ్చేవాళ్లు నిద్రపోయినా అది సరైన నిద్ర కాదు. డీప్ స్లీప్‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లగానే గురక మొదలవుతుంది. సౌండ్ స్లీప్ ఎప్పుడూ బ్రెయిన్‌‌‌‌‌‌‌‌కి సరైన రెస్ట్ ఇవ్వలేదు. దీనివల్ల సరైన నిద్ర లేక పోవటం, నిద్రలో బాడీకి సరిపోయేంత ఆక్సీజన్ అందక పోవటం,  బాడీలో కార్బన్ డై ఆక్సైడ్ ఎక్కువ అయిపోయి ఎప్పుడూ మత్తుగా ఉండటం, పగటి పూట నిద్ర మత్తు వస్తూ ఉండటం లాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ సమస్యలు ఉంటే అది స్లీప్ ఆప్నియా స్టేజ్ అని అర్థం చేసుకోవాలి. ఎక్కువ ఆలస్యం చేయకుండా డాక్టర్ ని కలవాల్సిందే. స్మోకింగ్ అలవాటు ఉన్నవాళ్లలో శ్వాస నాళాల్లో ఇన్ ఫ్లమేషన్ వల్ల కూడా సరిగ్గా ఊపిరి ఆడక పోవటం వల్ల గురక వస్తుంది. నిద్రలో ఉండే పొజిషన్ సరిగా లేకపోయిన్నా గురక వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి స్మోకింగ్ లాంటి అలవాట్లని తగ్గించుకోవటం, నిద్రపోయేటప్పుడు పడుకునే పొజిషన్ సరిగ్గా ఉండేలా చూసుకోవటం అవసరం. వెల్లకిలా పడుకున్నప్పుడు గురక వస్తుంటే ఒక పక్కకి తిరిగి పడుకోవాలి. రాత్రిపూట హెవీ మీల్ తీసుకోవద్దు. థైరాయిడ్, షుగర్ లాంటి సమస్యలున్నప్పుడు మెడికేషన్ సరిగ్గా ఉండాలి. ఏ సమస్య ఉన్నా ముందు డాక్టర్ సలహా తీసుకోవటం అవసరం, డాక్టర్ సజెస్ట్ చేయకుండా ఎలాంటి మందులు వాడొద్దు.  డా. ఎస్.ఏ. రఫి, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్​. హైదరాబాద్​.