మాటల్లో పెట్టి మొబైల్ లాగేస్తారు.. ఇంటర్నేషనల్ మొబైల్ స్నాచింగ్ ముఠా అరెస్ట్ : సీపీ

మాటల్లో పెట్టి మొబైల్ లాగేస్తారు.. ఇంటర్నేషనల్ మొబైల్ స్నాచింగ్ ముఠా అరెస్ట్ : సీపీ

ఇంటర్నేషనల్ మొబైల్ స్నాచింగ్ ముఠాను అరెస్ట్ చేశామని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నడుచుకుంటూ వెళుతున్న వారిని టార్గెట్ గా చేసుకొని మొబైల్ స్నాచింగ్ చేస్తున్నారని అన్నారు. కొన్ని సందర్భాల్లో మాటల్లో పెట్టి మొబైల్ స్నాచింగ్, నగదు చోరీ చేస్తున్నారని విచారణలో తెలిసిందన్నారు. రాత్రి 10 గంటలు తరువాత ఈ మొబైల్ స్నాచింగ్ చేస్తున్నట్లు గుర్తించామన్నారు. మూడు కమిషనరేట్ లలో ఇలా మొబైల్ స్నాచింగ్ చేస్తున్నారని తెలిపారు.హైదరాబాద్ లో సీపీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రోజుకు 3 నుండి నాలుగు కేసులు నమోదు అయ్యాయని అన్నారు.  

ఇంటర్నేషనల్ మొబైల్ స్నాచింగ్ ముఠాగా గుర్తించామని వెల్లడించారు. 7 కేసులు హైదరాబాద్ లో మొబైల్ స్నాచింగ్ చేసినట్లు గుర్తించామని తెలిపారు. బైక్ దొంగతనం కేసు ఎల్బీ నగర్ కేసు ను ఛేదించామని అన్నారు. సూడాన్ దేశానికి చెందిన 5 మంది ఇల్లిగల్ గా హైదరాబాద్ లో ఉంటున్నట్లు గుర్తించామన్నారు. హైదరాబాద్ లో దొంగతనం చేసిన మొబైల్స్ ను సూడాన్ కి పంపుతున్నారని విచారణలో తెలిసిందన్నారు.  నిరుద్యోగ యువతకు జీతాలు ఇచ్చి మొబైల్ స్నాచింగ్ కి చేయిస్తున్నట్టు సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.