సెమీ ఫైనల్లో కేసీఆర్ ని ఓడించాం... ఫైనల్లో బీజేపీని బొందపెట్టాలె : సీఎం రేవంత్ రెడ్డి

సెమీ ఫైనల్లో కేసీఆర్ ని ఓడించాం... ఫైనల్లో బీజేపీని బొందపెట్టాలె  :  సీఎం రేవంత్ రెడ్డి

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపులో సోషల్ మీడియా కీ రోల్ పోషించిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.  సెమీ ఫైనల్లో కేసీఆర్ ని ఓడించామని... ఫైనల్లో బీజేపీని బొందపెట్టాలని చెప్పారు. ఒకటే లెక్క... 14 పక్కా అన్నారు రేవంత్. పార్టీలో కొత్త నాయకత్వం రావాల్సిందేనన్నారు సీఎం. తప్పుడు వార్తలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సూచించారు. శ్రీరాముడి పేరు మీద బీజేపీ రాజకీయం చేస్తోందని ఫైరయ్యారు రేవంత్. హైదరాబాద్ జూబ్లీహిల్స్ క్యాంపు ఆఫీస్ లో సోషల్ మీడియా ప్రతినిధులతో ఇంట్రాక్ట్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలను వివరించారు.  

Also Read:హరీశ్‌రావు రాజీనామాతో కొత్త డ్రామాకు తెర తీసిండు

అంతకుముంద ఆగస్టు 15 లోపు రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యే  హరీశ్ రావు సవాల్ ను స్వీకరిస్తున్నానని చెప్పారు. పంద్రాగస్టు లోపు రుణమాఫీ చేసి తీరుతామని...హరీశ్ రావు  రాజీనామా లేఖను రెడీగా పెట్టుకోవాలని సూచించారు. రైతులకు రుణమాఫీ చేయకపోతే తమ ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు. హరీశ్ రావుకు సిగ్గుండాలి.. రాజీనామా ఫార్మాట్ తెల్వదా? రాజీనామా లేఖలో సీస పద్యం రాసుకొచ్చారని సెటైర్ వేశారు.