
మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannaah) ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ ఓదెల 2(Odela 2). 2022లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓదెల రైల్వే స్టేషన్ సినిమాకు ఇది సీక్వెల్. మొదటి పార్టులో హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటించగా.. పార్ట్ 2లో తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంపత్ నంది(Sampath Nandi) కథ అందిస్తూ నిర్మిస్తున్న ఈ సినిమాను అశోక్ తేజ(Ashok Tej) తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాశీలో లాంఛనంగా ప్రారంభమైన ఈ మూవీ మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తి చేసుకుంది.
తాజాగా ఓదెలలో రెండో షెడ్యూల్ ప్రారంభించారు మేకర్స్. ఈ సందర్బంగా ఓదెల 2 నుండి తమన్నా పాత్రను పరిచయం చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు మేకర్స్. వీడియోలో శివ శక్తిగా కాషాయ దుస్తుల్లో లేడీ అఘోరాగా పవర్ఫుల్ గా కనిపించారు తమన్నా. ఇక ఈ వీడియోకి లేటెస్ట్ సెన్సేషన్ అంజనీష్ లోకనాథ్ అందించిన మ్యూజిక్ నెక్స్ట్ లెవల్లో ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకొని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా.