
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr) అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన నవ్వు. ఎవరితోనైనా చనువుగా నవ్వుతు మాట్లాడటం ఆయన స్పెషాలిటీ. చాలామందికి ఆయనలో నచ్చే విషయం కూడా అదే. ఆయన్ని సీరియస్ గా చూడటం చాలా కష్టం. ఇటీవల ఎన్టీఆర్ కూడా ఇదే విషయం గురించి మాట్లాడారు. తాను నవ్వడం మొదలుపెడితే ఆపడం కష్టమని చెప్పుకొచ్చారు. అయితే అంత సరదాగా ఉండే ఎన్టీఆర్ సడన్ గా సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ వార్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ మధ్యే ఆయన ఈ సినిమా షూటింగ్ లో అడుగుపెట్టారు. దానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే.. తాజాగా ఈ సినిమా షూటింగ్ కోసం ముంబైకి వెళ్లారు ఎన్టీఆర్. ఫోన్ మాట్లాడుకుంటూ హోటల్ కి వెళ్తున్న ఎన్టీఆర్ సడన్ గా ఫోటోగ్రాఫర్ పై సీరియస్ అయ్యారు. దీంతో ఒక్కసారిగా ఆ వీడియో వైరల్ గా మారింది.
#JrNTR was visibly frustrated over paparazzi capturing him without consent.
— Gulte (@GulteOfficial) April 25, 2024
We have seen Tarak hiding his makeover for #WAR2 in recent public appearances. pic.twitter.com/ebwbNREQNF
ఇక ఎన్టీఆర్ కోపానికి కారణం ఏంటా నా ఆరాతీయగా తెలిసిన విషయం ఏంటంటే.. వార్ 2 కోసం ఎన్టీఆర్ సరికొత్త మేకోవర్ లో కనిపిస్తున్నారు. హెయిర్ స్టైల్ అండ్ డ్రెస్సింగ్ కూడా చాలా మార్చారు. ఆ లుక్ బయటకు రివీల్ కాకూడదు అనే ఉద్దేశంలో మేకర్స్ ఉన్నారని సమాచారం. కానీ, ఆ ఫోటోగ్రాఫర్ వీడే తీయడంతో ఎన్టీఆర్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది.