కేరళలో ముగ్గురు ఓటర్లు, ఓ పోలింగ్ బూత్ ఏజెంట్ మృతి

కేరళలో ముగ్గురు ఓటర్లు, ఓ పోలింగ్ బూత్ ఏజెంట్ మృతి

కేరళా రాష్ట్రంలోని మొత్తం 20 లోక్ సభ నియోజకవర్గాల్లో శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఆ రాష్ట్రంలో జరిగిన వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ఓటర్లు, ఓ పోలింగ్ ఏజెంట్ చనిపోయారు. మృతి చెందిన వారందరూ ఆరవై ఏళ్ల పైబడిన వృద్ధులే.  ఒట్టపాలెం చునాంగడ్ లోని వాణి విలాసిని వద్ద ఓ వ్యక్తి కుప్పకూలిపోయాడు. చనిపోయిన వ్యక్తి చునంగాడ్ లోని మోడరన్ కట్టిల్ కు చెందిన చంద్రన్(68) గా గుర్తించారు. హాస్పిటల్ కు తీసుకెళ్లినా ప్రాణాలు దక్కలే. ఎండ తీవ్రత కారణంగానే పలు అనారోగ్య సమస్యలు ఉన్న చంద్రన్ మృతికి కారణం.  సిద్ధిక్(-63) అనే మదర్సా టీచర్, సోమరాజన్ (82)  ఓటు వేసి ఇంటికి వెళ్తూ మృతి చెందారు.

కుట్టిచిర ప్రభుత్వ పాఠశాలలోని 16వ బూత్ లో పోలింగ్  ఏజెంట్ గా ఉన్న అనీస్ పోలింగ్ బూత్ లోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తుండగా అనీ చనిపోయాడు. అనీస్ వయసు 66ఏళ్లు. ఆయనో రిటైర్డ్ ఇంజనీర్. అధిక ఉష్ణోగ్రత వల్ల వడదెబ్బ, పలు అనారోగ్యా సమస్యలు కారణంగా మృతి చెందారు. పైగా చనిపోయిన వారందరూ వృద్ధులు.