ఖమ్మం జిల్లాలో పెదవాగు ఉగ్రరూపం.. వాగులో చిక్కుకున్న 20 మంది కూలీలు.. ఒడ్డుకు చేర్చిన గ్రామస్తులు

ఖమ్మం జిల్లాలో పెదవాగు ఉగ్రరూపం.. వాగులో చిక్కుకున్న 20 మంది కూలీలు.. ఒడ్డుకు చేర్చిన గ్రామస్తులు

ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వానలకు జిల్లాలో వాగులు, వంకలు నిండుగా పొంగిపొర్లుతున్నాయి. శనివారం (సెప్టెంబర్ 13) కురిసిన వానలకు జిల్లాలో పెదవాగు ఉగ్రరూపం దాల్చింది. ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు ఆగిపోయాయి. 

ఖమ్మం జిల్లా ఏన్కూర్  మండల పరిధిలో నిన్న కురిసిన భారీ వర్షానికి  కేసుపల్లి సమీపంలో ఉన్న పెద్దవాగు భయంకరంగా ప్రవహించింది. పనులకు వెళ్లిన 20 మంది మహిళా కూలీలు వరదలో చిక్కుకున్నారు. ఇంతకితకూ పెరుగుతున్న వరద ఉధృతితో బయటపడే మార్గం తెలియక భయాందోళనకు గురయ్యారు. 

దీంతో స్థానికులు అక్కడికి చేరుకుని మహిళలకు సహాయం చేశారు. తాళ్ల సాయంతో  కూలీలను ఒడ్డుకు చేర్చారు.