మావోయిస్టుల డంప్‌‌‌‌‌‌‌‌ నిర్వీర్యం.. ఊసూరు పోలీస్‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌ పరిధిలో గుర్తింపు

మావోయిస్టుల డంప్‌‌‌‌‌‌‌‌ నిర్వీర్యం.. ఊసూరు పోలీస్‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌ పరిధిలో గుర్తింపు

 

 

భద్రాచలం, వెలుగు : ఛత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌ రాష్ట్రంలోని బీజాపూర్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో మావోయిస్టుల డంప్‌‌‌‌‌‌‌‌ను భద్రతా బలగాలు గుర్తించి నిర్వీర్యం చేశాయి. ఊసూరు పోలీస్‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌ పరిధిలోని తడపలగుట్టల్లో 14 ఐఈడీలను గుర్తించిన జవాన్లు బాంబ్‌‌‌‌‌‌‌‌ డిస్ఫ్యూజ్‌‌‌‌‌‌‌‌ టీంకు సమాచారం ఇచ్చారు. 13 బీరు సీసాల్లో, ఒక ఐరన్‌‌‌‌‌‌‌‌ పైపులో అమర్చిన ఐఈడీని నిర్వీర్యం చేశారు. భూమిలో పాతిపెట్టిన డ్రమ్ముల్లో పేలుడు పదార్థాలతో పాటు 11 కిలోల గన్‌‌‌‌‌‌‌‌ పౌడర్‌‌‌‌‌‌‌‌, మావోయిస్టుల యూనిఫామ్స్‌‌‌‌‌‌‌‌ సైతం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే మోదక్‌‌‌‌‌‌‌‌పాల్‌‌‌‌‌‌‌‌ పోలీస్‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌ పరిధిలోని పంగుడు గ్రామంలో, టేకుమెట్ల పోలీస్‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌ పరిధిలోని కుంజాపారా గ్రామాల్లో మావోయిస్ట్‌‌‌‌‌‌‌‌ అమరవీరుల స్మారక స్తూపాలను భద్రతాబలగాలు కూల్చివేశాయి.