పెనుబల్లి, వెలుగు : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ స్టేట్ టాపర్గా నిలిచిన విద్యార్థులకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ రూ.5 లక్షల బహుమతి అందించనుంది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఆ కంపెనీ బంపర్ ప్రకటింది. పెనుబల్లి మండలం వీఎం బంజరు ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధి ఇమ్మడి రామకృష్ణ, ప్రతినిధులు పదో తరగతి విద్యార్థులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు స్టేట్ టాపర్ గా నిలిచిన వారికి రూ.5 లక్షల బహుమతి, స్టేట్ రెండవ స్థానంలో నిలిచిన వారికి రూ.3 లక్షలు, జిల్లా టాపర్ గా నిలిచిన విద్యార్థులకు రూ.2 లక్షల నగదు బహుమతి అందజేయనున్నట్లు తెలిపారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గ టాపర్ కు రూ.లక్ష, మండల స్థాయి టాపర్ కు రూ.10 వేల నగదు బహుమతి అందజేస్తామన్నారు. అనంతరం ప్రోత్సహాకాలకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు.
