యూరియా కోసం రైతులు ఆందోళన చెందొద్దు

 యూరియా కోసం రైతులు ఆందోళన చెందొద్దు

కూసుమంచి, వెలుగు : పీఏసీఎస్, ఫర్టిలైజర్ దుకాణాల్లో యూరియా రైతులకు సరిపడా అందుబాటులో ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదనిఏడీఏ సతీశ్, ఏవో వాణి రైతులకు సూచించారు. శుక్రవారం మండలంలో జీళ్లచెరువు, చేగోమ్మ సొసైటీలు, ప్రైవేట్​ఎరువుల దుకాణాలను అధికారులు సందర్శించి యూరియా స్టాక్​ను పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాప్ ద్వారా రైతులు బుక్ చేసుకున్న యూరియాను ఒక్క రోజే 4,813 బస్తాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. చదువురాని రైతులకు ఏఈవోలు, వలంటీర్లు యాప్​లో బుక్​చేసేందుకు అందుబాటులో ఉంటారని చెప్పారు. వారి వెంట  ఏఈవో రవీందర్, సొసైటీ సిబ్బంది తదితరులు ఉన్నారు.