వన సంరక్షణ వీఎస్ఎస్ బాధ్యత : పీసీసీఎఫ్ డాక్టర్ సువర్ణ

వన సంరక్షణ వీఎస్ఎస్ బాధ్యత : పీసీసీఎఫ్ డాక్టర్ సువర్ణ

సత్తుపల్లి, వెలుగు : వన సంరక్షణ వీఎస్ఎస్​ల  బాధ్యత అని పీసీసీఎఫ్​డాక్టర్​సువర్ణ అన్నారు. శుక్రవారం సత్తుపల్లి అటవీ రేంజ్ పరిధిలో అటవీశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆమె ప్రారంభించారు. అక్కడి ప్రాథమిక పాఠశాలను పరిశీలించి విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు అందజేశారు. విద్యార్థులకు అటవీ ప్రాముఖ్యత గురించి వివరించారు. స్థానికంగా ఉన్న హెల్త్ సబ్ సెంటర్ ను పరిశీలించారు.

ఇస్తరాకుల తయారీ యూనిట్, ఒత్తులు, తేనెటీగల పెంపకం తీరు తెన్నులను గురించి వీఎస్ఎస్ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. సత్తుపల్లి టెంపర్ డిపోలో నూతనంగా నిర్మించిన వీఐపీ గదిని ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో డీఎఫ్ వో సిద్ధార్థ విక్రమ్ సింగ్, ఎఫ్ డీవో మంజుల, రేంజర్ స్నేహలత, సిబ్బంది పాల్గొన్నారు.