
బ్యూటీకేర్.. ఫేస్, హ్యాండ్స్ కు మాత్రమే కాదు కాళ్లకూ అవసరమే. ప్రతిరోజు కాకపోయినా వారానికొకసారైనా పాదాల కోసం కాస్త టైం కేటాయించాలి. ముఖ్యంగా వానాకాలంలో వచ్చే సమస్యలను ఎదుర్కోవాలంటే కచ్చితంగా కేర్ తీసుకోవాలి. అయితే.. కొన్ని రకాల స్క్రబ్స్ కాళ్లకు మ్యాజిక్ లా పనిచేస్తాయి. కొత్త గ్లోను తెచ్చిపెడతాయి
పాదాలకు స్క్రబ్ చేయాలంటే కాస్ట్లీ క్రీములే కొనక్కరలేదు. జస్ట్ ఇంట్లో దొరికేవాటితో స్క్రబ్స్ తయారు చేయొచ్చు. టైం దొరికినప్పుడు ఈ స్క్రబ్స్ ను అప్లై చేస్తుంటే.. పాదాలు మృదువుగా తయారవుతాయి.
అరటిపండు, అవకాడో: అరటి పండు, అవకాడో గుజ్జులను ఈక్వెల్ గా తీసుకొని అందులో కాస్త తేనె మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని కాళ్లకు పట్టించడంతో పాదాల పగుళ్లు తగ్గుతాయి. ఈ మిక్స్ ను పాదాలకు పావుగంట ఉంచి.. ఆ తర్వాత స్క్రబ్ చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే.. పగుళ్ల నుంచి రిలీఫ్ దొరుకుతుంది. అవకాడోలో ఉండే ఎస్సెన్షియల్ ఆయిల్స్, అరటి పండులో దొరికే మాయిశ్చరైజర్ కాళ్లకు బాగా పనిచేస్తాయి.
షుగర్, ఆలివ్ ఆయిల్ : రెండు స్పూన్ల షుగర్ కు రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్ కలపాలి. దీన్ని కొంచెం బాగా మిక్స్ చేయాలి. ఇందులో కావాలనుకుంటే కాస్త నువ్వుల నూనె, కొబ్బరి నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని కాళ్ళకు అప్లై చేసి పది నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత మరో పది నిమిషాలు స్మూత్ గా స్క్రబ్ చేసి..వార్మ్ వాటర్ తో కడగాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే పాదాలపై ఉండే డెడ్ స్కిన్ పోయి..గ్లో వస్తుంది.
కాఫీ, కోకోనట్ ఆయిల్ : రెండు టేబుల్ స్పూన్ల కాఫీ, ఒక టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని పాదాలపై వరకు ప్యాక్ లా వేయాలి. కాసేపు ఆరిన తర్వాత మళ్లీ కొంచెం ఆరిన ప్యాక్ పై వెయ్యాలి.పది నిమిషాలు ఆరిన తర్వాత స్మూత్ గా స్క్రబ్ చేస్తే పాదాలు మృదువుగా తయారవుతాయి. కాళ్లపై దీన్ని మసాజ్ చేయడం వల్ల కాఫీ లో ఉండే కెఫీన్ తో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. వారానికి ఒకసారి ఇలా చేస్తుంటే కాళ్లు పొడిగా మారకుండా ఉంటాయి.
ALSO READ : ఖతర్నాక్ క్యాప్సికం కర్రీలు..
తేనె, నిమ్మకాయ: రెండు టేబుల్ స్పూన్ల నిమ్మకాయ రసానికి ఒక టేబుల్ స్పూన్ షుగర్, రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కాళ్లకు పట్టించి.. అరగంట వదిలేయాలి. ఆ తర్వాత వార్మ్ వాటర్ ను చేతులకు తడుపుతూ స్క్రబ్ చేయడంతో కాళ్లపై ఉండే మట్టి పోయి.. తెల్లగా మారతాయి. బాగా డ్రై గా ఉంది.. ట్యాన్ బాగా పెరిగిపోయి ఉన్నకాళ్లకు ఈ స్క్రబ్ బాగా ఉపయోగపడుతుం ది. వారానికి రెండుసార్లు కాళ్లకు అప్లై చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది.ఇంట్లో దొరికేవాటితోనే స్క్రబ్స్ తయారు చేసుకుని తరచూ అప్లై చేస్తుంటే కాళ్లు అందంగా.. హెల్దీగా ఉంటాయి. సో ఇంకెందుకులేట్ ఈ రోజే ఓసారి ట్రై చేసి చూడండి.