
ఈ సెప్టెంబర్ సెకండ్ వీకెండ్.. ఓటీటీల్లో అదిరిపోయే సినిమాలు ఉన్నాయి. గడిచిన రెండు నెలల్లో థియేటర్లోకి వచ్చి, బ్లాక్ బస్టర్ అయిన మూవీస్ అందుబాటులోకి వచ్చి ఆడియన్స్ను అలరిస్తున్నాయి. మరీ, ముఖ్యంగా చెప్పాలంటే.. చాలా రోజుల నుంచి ఆడియన్స్ ఈ సినిమాల కోసం వెయిట్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ సినిమాలన్నీ ఓటీటీకి వచ్చేసి, మంచి వ్యూస్ దక్కించుకుంటూ సత్తా చాటుతున్నాయి. అసలు ఆ సినిమాలేంటీ? అవెక్కడ స్ట్రీమ్ అవుతున్నాయనేది లుక్కేద్దాం.
ప్రైమ్ వీడియో:
బకాసుర రెస్టారెంట్ (తెలుగు హారర్ కామెడీ)- సెప్టెంబర్ 08
కూలీ (గ్యాంగ్ స్టార్ యాక్షన్ డ్రామా)- సెప్టెంబర్ 12
పరదా (రూరల్ ఫిక్షనల్ డ్రామా)- సెప్టెంబర్ 12
జన్మ నచ్చతిరమ్ (తమిళ హారర్ థ్రిల్లర్)- సెప్టెంబర్ 12
మీషా (మలయాళం సర్వైవల్ థ్రిల్లర్)- సెప్టెంబర్ 12
డూ యూ వానా పార్ట్‌నర్ (హిందీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 12
నెట్‌ఫ్లిక్స్:
సయ్యారా (రొమాంటిక్ లవ్ స్టోరీ)- సెప్టెంబర్ 12
మేల్‌డిక్షన్స్ (ఇంగ్లీష్ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా)- సెప్టెంబర్ 12
రాటు రాటు క్వీన్స్: ది సిరీస్ (ఇంగ్లీష్ కామెడీ డ్రామా సిరీస్)- సెప్టెంబర్ 12
జియోహాట్‌స్టార్:
టాస్క్ (అమెరికన్ క్రైమ్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 08
ఓన్లీ మర్డర్స్ ఇన్ ద బిల్డింగ్ సీజన్ 5 (ఇంగ్లీష్ క్రైమ్ మిస్టరీ సిరీస్)- సెప్టెంబర్9
సు ఫ్రమ్ సో ( కన్నడ హారర్ కామెడీ)- సెప్టెంబర్ 12
'రాంబో ఇన్ లవ్ (తెలుగు రొమాంటిక్ కామెడీ సిరీస్)- సెప్టెంబర్ 12
SUN NXT:
మీషా (మలయాళ సస్పెన్స్ సర్వైవల్ డ్రామా)- సెప్టెంబర్ 12
బకాసుర రెస్టారెంట్ (తెలుగు హారర్ కామెడీ)- సెప్టెంబర్ 12
ఈ సినిమాల లిస్ట్లో రజనీ-నాగార్జునల కూలీ, అనుపమ 'పరదా', బ్లాక్ బస్టర్ 'సయ్యారా', రాజ్ బి శెట్టి 'సు ఫ్రమ్ సో, తమన్నా 'డూ యూ వాన్నా పార్టనర్, కమెడియన్ ప్రవీణ్ 'బకాసుర రెస్టారెంట్, మీషా, రాంబో ఇన్ లవ్, స్పెషల్‌గా ఉన్నాయి. ఇక ఆలస్యం ఎందుకు ఎంచక్కా వీకెండ్ ఎంజాయ్ చేసేయండి.