వాటర్ బాటిల్ మూతల రంగును బట్టి.. నీటి స్వచ్చత తెలుసుకోవచ్చు..!

వాటర్ బాటిల్ మూతల రంగును బట్టి..  నీటి స్వచ్చత తెలుసుకోవచ్చు..!

పూర్వ కాలంలో బజారుకు వెళితే చాలు.. పక్కాగా వాటర్​ బాటిల్​ వెంట పెట్టుకొని వెళ్లేవారు.  కాని హైటెక్​ యుగంలో ఎక్కడికక్కడ వాటర్​ బాటిల్స్​ అమ్ముతున్నారు.   అది ఎలాంటి వాటర్​ అయినా కాస్త గొంతు తడుపుకొనేందుకు బాటిల్​ కొనుక్కొని తాగుతున్నాము..

 అంతాక ఎందుకు.. రైళ్లలో.. బస్సుల్లో ప్రయాణం చేసేటప్పుడు కూడా ఇదే పరిస్థితి..  ఆ బాటిల్స్​ లో ఎలాంటి వాటర్​ వాటర్​ ఉంది..  అది మినరల్​ వాటరా.. ఫిల్టర్​ వాటరా.. ఆల్కలైన్​వాటరా అనే విషయాన్ని ముందే తెలుసుకోవచ్చట..వాటర్​ బాటిల్స్​ మూతల రహస్యం గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. . . . .

చాలామంది ఇళ్లలో మినరల్​ వాడతారు.. కొంతమంది ఫిల్టర్​ వాడతారు.. ఇలా ఎవరి ఇష్టం వారిది.  కాని ప్రయాణాల్లో ఇలా సాధ్యపడదు కదా..!  ప్రస్తుతం ఇంటి నుంచి వాటర్​ బాటిల్​ తీసుకెళ్లే కల్చర్​ ఎప్పుడో పోయింది.  కాని బయట మార్కెట్లో దొరికే వాటర్​ బాటిల్​ మూత రంగును బట్టి.. అది ఎలాంటి వాటరో తెలుసుకోవచ్చు.  

వాటర్​ బాటిల్స్​ మూతల వివిధ రంగుల్లో ఉంటాయి.  బయట మార్కెట్లో లభించే వాటర్​ బాటిల్స్​
ఆ బాటిల్ మూత రంగు..  ఆకుపచ్చ, తెలుపు, నీలం, పసుపు, నలుపు, రంగుల్లో ఉంటాయి.  ఈ విషయాన్ని మనం గమనించం కాని ... ఆ బాటిల్​ మూతను బట్టి వాటర్​ క్వాలిటి అంచనా వేయవచ్చు. 

 ఆకుపచ్చ మూత:  ఈ రంగు మూత గల వాటర్​ బాటిల్స్​లోని వాటర్​  సహజ వనరుల నీరు  నుంచి సేకరించి, ఫిల్టరింగ్ ద్వారా తాగడానికి సురక్షితంగా మారుస్తారు. ఇది ప్రకృతితో సమీపంగా ఉండే శుద్ధమైన నీరు, ఎలాంటి రసాయనాలు లేకుండా శరీరానికి మేలు చేస్తుంది.

 తెలుపు మూత :    ఫిల్టర్ చేయబడిన నీటిని అమ్మేటప్పుడు వాటర్​ బాటిల్​ కు తెల్ల రంగుమూతను ఏర్పాటు చేస్తారు.  మెషనరీ  ద్వారా శుద్ధి చేయబడిన నీటిని సూచిస్తాయి. RO ప్లాంట్ లేదా ఇతర ఫిల్టర్ మెషీన్ల ద్వారా శుద్ధి చేయబడిన  నీరు అత్యంత సురక్షితం. 

 నీలం మూత:  నీలం రంగు మూత  గల వాటర్ బాటిల్​ లో ​ మినరల్ వాటర్  ఉంటుంది.  ఈ నీరు నేరుగా స్వభావిక వనరుల నుంచి సేకరించబడిన మినరల్ వాటర్ . . 

 పసుపు మూత.. ఈ మూత కలిగిన వాటర్​ బాటిల్​ లోని వాటర్​  విటమిన్లతో కలిపిన ఫార్ములా నీరు. 
 ఈ నీటిలో విటమిన్లు, ఎలక్ట్రోలైట్లు కలిపి ఉంటాయి.  వ్యాయామం తర్వాత, శరీరానికి శక్తిని రిహైడ్రేషన్‌ను అందించడంలో ఉపయోగపడుతుంది. 

నలుపు మూత : ఈ రంగు మూత ఉన్న వాటర్​ బాటిల్​ లో ఆల్కలైన్ వాటర్ ఉంటుంది. ఈ నీటిలో సహజ మినరల్స్, pH బ్యాలెన్స్ మరియు శరీరానికి కావలసిన ఇతర అంశాలు ఉంటాయి. ఎక్కువగా సెలబ్రిటీలు, క్రీడాకారులు ఇలాంటి నీటిని ఉపయోగిస్తారు. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా, ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కూడా నిలుపుతుంది.