
ఎవరైనా సినిమా థియేటర్కు ఎందుకెళతారు. ఇదేం పిచ్చి ప్రశ్న.. సినిమా చూడటానికి వెళతారని రొటీన్ ఆన్సర్ ఇస్తారేమో. కానీ కొందరు సినిమా థియేటర్కు WFT కోసం వెళుతున్నారు. అంటే.. ‘వర్క్ ఫ్రం థియేటర్’. అవును.. సినిమా థియేటర్లో కూడా కొందరికి వర్క్ టార్చర్ తప్పడం లేదు.
బెంగళూరులోని ఒక సినిమా థియేటర్లో యువతి ల్యాప్ టాప్లో వర్క్ చేస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కార్పొరేట్ సంస్థలు, కొన్ని ఐటీ సంస్థలు ఉద్యోగులను బానిసలుగా భావిస్తున్నాయని, ఇలా ఎక్కడకు వెళ్లినా టార్చర్ చేస్తూ పని ఒత్తిడిని పెంచుతున్నాయని నెటిజన్లు ఆ ఫొటోపై స్పందించారు.
బెంగళూరు సిటీలో ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా తయారైందని.. ‘లోక’ సినిమా చూసేందుకు థియేటర్కు వెళ్లిన తనకు ఇలా ల్యాప్ టాప్లో వర్క్ చేస్తూ ఒక యువతి కనిపించిందని రెడిట్ యూజర్ ఈ ఫొటోను షేర్ చేశాడు. బెంగళూరులో కార్పొరేట్ సంస్థల తీరు మారాలని, ఉద్యోగుల వ్యక్తిగత స్వే్చ్ఛకు భంగం కలిగించేలా ప్రవర్తించడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు.