విద్యతోనే  సమాజాభివృద్ధి :  ప్రొ. గోవర్ధన్

విద్యతోనే  సమాజాభివృద్ధి :  ప్రొ. గోవర్ధన్

హైదరాబాద్ సిటీ, వెలుగు: విద్య ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందని బాసర ట్రిపుల్ ఐటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్ అన్నారు. శనివారం బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన తెలంగాణ సమగర మోచి ఉద్యోగుల సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణలో ఆయన పాల్గొన్నారు.

ఆర్థిక ఇబ్బందులతో చదువు ఆపేస్తున్న వారికి సంక్షేమ సంఘాలు చేయూత అందించాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే గంగారం సౌదుడే, సంఘం చైర్మన్ దొంతుల సత్యనారాయణ , అధ్యక్షుడు ఇంజినీర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.