న్యూ ఏజ్ లవ్ స్టోరీగా ఏమో ఏమో ఇది

న్యూ ఏజ్ లవ్ స్టోరీగా ఏమో ఏమో ఇది

ఇటీవల 'చాంపియన్' చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చిన రోషన్ మేకా.. తాజాగా తన కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రీతి ముకుందన్ హీరోయిన్గా నటిస్తోంది. శనివారం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ మూవీ టైటిల్ తోపాటు స్పెషల్ గ్లింపు రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి 'ఏమో ఏమో ఇది' అనే టైటిల్ను అనౌన్స్ చేశారు. 

ఇక గ్లింప్స్ విషయానికొస్తే.. తల్లి-కొడుకుల మధ్య సరదా సంభాషణతో మొదలై.. న్యూ ఏజ్ లవ్, మోడర్న్ మ్యారేజెస్ ను ఎంటర్ టైనింగ్ గా చూపించారు. 'హిట్' యూనివర్స్ తో గుర్తింపు పొందిన దర్శకుడు శైలేష్ కొలను.. రొమాంటిక్ కామెడీ మూవీగా దీన్ని రూపొందిస్తున్నాడు. హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.