ప్రకృతితో మమేకం అవుతూ..సోల్ ట్రిప్

ప్రకృతితో మమేకం అవుతూ..సోల్ ట్రిప్

పోస్టర్, అన్వేషి వంటి సినిమాల్లో హీరోగా నటించిన విజయ్ దాట్ల 'సోల్ ట్రిప్' పేరుతో ఓ ట్రావెల్ బేస్డ్ అడ్వెంచరస్ టాక్ షో ప్రారంభించాడు. త్వరలోనే ఈ టాక్ షో మొదటి సీజన్ స్ట్రీమింగ్ కాబోతోంది. శ్రీకాంత్, జగపతి బాబు, అలీవంటి ఆర్టిస్టులని ప్రకృతితో మమేకం చేస్తూ విజయ్ దాట్ల షోనిర్వహించాడు. ఈ ఇంటర్వ్యూలకు సంబంధిం చిన ఆరు ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. 

తాజాగా షోకు సంబంధించి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ 'నాకు ట్రా వెలింగ్ అంటే చాలా ఇష్టం. వేరే ఊరికి వెళ్లి అక్కడికల్చర్ కు తగ్గట్టుగా బతకడం అనే ఈ కాన్సెప్ట్ చాలా నచ్చింది. ఫస్ట్ సీజన్లోని ఆరు ఎపిసోడ్స్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా' అని అన్నారు. ఈ జర్నీలో తనకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ విజయ్ దాట్ల థ్యాంక్స్ చెప్పాడు. కార్యక్రమంలో కృష్ణంరాజు భార్య శ్యామల దేవీ, నటుడు అలీ, దర్శకుడు సతీష్ వేగేశ్న పాల్గొన్నారు.