'కోర్ట్' చిత్రంతో సక్సెస్ అందుకున్న హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటిస్తున్న మరో చిత్రం 'బ్యాండ్ మేళం'. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన వెంకట్ నిర్మిస్తున్నారు. సతీష్ జవ్వాజీ దర్శకత్వం వహిస్తున్నాడు. మార్చి 13న సినిమాచేసిన దర్శకుడు త్రివిక్రమ్ టీమ్కు బెస్ట్ విషెస్ చెప్పారు. ఈ సందర్భం గా నిర్వహించిన ఈవెంట్ కు దర్శకుడు బాబీ, రచయిత బీవీఎస్ రవి అతిథులుగా హాజరై ఈ చిత్రానికి 'కోర్ట్'ను మించి విజయం దక్కా లని కోరారు.
ఈ చిత్రం తనకు మరింత ప్రత్యేకంగా నిలుస్తుందని హర్ష్ రోషన్ అన్నాడు. ఇందులో తాను పోషించిన రాజమ్మ పాత్ర అందర్నీ నవ్విస్తుంది. ఏడిపిస్తుంది అని హీరోయిన్ శ్రీదేవి చెప్పింది. ఇందులోని ప్రతి సీన్ న్ను ఎంతో ఎమోషన్తో రాశానని, వాటికి ఆడియెన్స్ కనెక్ట్ అవుతారని దర్శకుడుసతీష్ జవ్వాజీ చెప్పాడు. నిర్మాత కోన వెంకట్ మాట్లాడు. తూ 'నేనేమీ రెగ్యులర్ ప్రొడ్యూసర్ని కాదు. మనసుకి నచ్చిన కథ వస్తేనే సినిమా తీస్తా జీవితాంతం గుర్తుం డిపోయే సినిమాగా ఇది నిలుస్తుంది' అని అన్నారు.
