దంచికొట్టిన మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రమ్.. 7 వికెట్లతో కివీస్‌‌‌‌‌‌‌‌పై సౌతాఫ్రికా విక్టరీ

దంచికొట్టిన మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రమ్.. 7 వికెట్లతో కివీస్‌‌‌‌‌‌‌‌పై సౌతాఫ్రికా విక్టరీ

అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌: టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌లో ఆసక్తి రేపిన ‘వాలెంటైన్స్‌‌‌‌‌‌‌‌ డే’ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌పై సౌతాఫ్రికాదే పైచేయి అయింది. కెప్టెన్‌‌‌‌‌‌‌‌ ఐడెన్‌‌‌‌‌‌‌‌ మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రమ్ (44 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 86 నాటౌట్‌‌‌‌‌‌‌‌) ఖతర్నాక్ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌తో ముందుండి నడిపించడంతో శనివారం జరిగిన గ్రూప్‌‌‌‌‌‌‌‌–డి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో సఫారీ టీమ్‌‌‌‌‌‌‌‌ ఏడు వికెట్ల తేడాతో కివీస్‌‌‌‌‌‌‌‌ను చిత్తు చేసింది. ఈ ఏకపక్ష పోరులో టాస్ ఓడి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 175/7 స్కోరు చేసింది. 

సఫారీ పేసర్ మార్కో యాన్సెన్  (4/40) దెబ్బకు ఆరంభంలోనే కివీస్‌‌‌‌‌‌‌‌కు గట్టి షాక్‌‌‌‌‌‌‌‌లు తగిలాయి. టిమ్ సిఫర్ట్ (13), రచిన్ రవీంద్ర (13), ప్రమాదకరమైన ఫిన్ అలెన్ (31) వికెట్లను యాన్సెన్ పడగొట్టడంతో ఆ టీమ్ 64/4తో కష్టాల్లో పడింది. మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మార్క్ చాప్‌‌‌‌‌‌‌‌మన్ (26 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 48), డారిల్ మిచెల్ (34).. చివర్లో జేమ్స్ నీషమ్ (23 నాటౌట్) పోరాడటంతో బ్లాక్‌‌‌‌‌‌‌‌క్యాప్స్ టీమ్ మంచి స్కోరు చేసింది. 

అనంతరం సౌతాఫ్రికా  17.1 ఓవర్లోనే178/3  స్కోరు చేసి ఈజీగా గెలిచింది. ఓపెనర్ మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రమ్ అద్భుత ఆటతో ఆకట్టుకున్నాడు. కివీస్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌ను ఉతికేస్తూ భారీ షాట్లు కొట్టాడు.  మరో ఓపెనర్ డికాక్ (20), రికెల్టన్  (21), బ్రెవిస్ (21), మిలర్ (24 నాటౌట్‌‌‌‌‌‌‌‌)తో కీలక భాగస్వామ్యాలతో జట్టును గెలిపించాడు. యాన్సెన్​కు   ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 

సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్:  20 ఓ వర్లలో 175/7 (చాప్‌‌‌‌‌‌‌‌మన్ 48, డారిల్ మిచెల్ 34 , యాన్సెన్  4/40). 
సౌతాఫ్రికా: 17.1 ఓవర్లలో 178/3 (మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రమ్ 86 నాటౌట్‌‌‌‌‌‌‌‌, మిల్లర్ 24 నాటౌట్‌‌‌‌‌‌‌‌, రచిన్ 1/9)