కోల్‌కతా: ఆదిల్ రషీద్ (3/36) స్పిన్ మ్యాజిక్‌తో టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ రెండో విజయం అందుకుంది. శనివారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో స్కాట్లాండ్‌ను ఓడించి సూపర్–-8 రేసులో నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన స్కాటిష్ టీమ్ 19.4 ఓవర్లలో 152 రన్స్‌కు ఆలౌటైంది. రికీ బెరింగ్టన్ (49), మైఖేల్ జోన్స్ (33), టామ్ బ్రూస్ (24) మెరుపులతో స్కాట్లాండ్ ఒక దశలో 113/3 స్కోరుతో పటిష్టంగా కనిపించినప్పటికీ ఆదిల్ వెంటవెంటనే మూడు వికెట్లు పడగొట్టి ఆ టీమ్‌ను దెబ్బకొట్టాడు.
14 రన్స్ తేడాతో 5 వికెట్లు కోల్పోయిన స్కాట్లాండ్ నార్మల్ స్కోరుకే పరిమితం అయింది. లియామ్ డాసన్ రెండు వికెట్లు తీశాడు. అనంతరం ఇంగ్లండ్ 18.2 ఓవర్లలో 155/5 స్కోరు చేసి గెలిచింది. ఓపెనర్లు ఫెయిలవడంతో 13/2తో నిలిచిన జట్టును టామ్ బాంటన్ (63 నాటౌట్) ఆదుకున్నాడు. అతనికి జాకబ్ బెథెల్ (32), సామ్ కరన్ (28) సపోర్ట్ ఇచ్చారు. బాంటమ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో గ్రూప్–-సిలో ఇంగ్లండ్ రెండో స్థానానికి చేరుకుంది.
ఒమన్‌పై ఐర్లాండ్ గ్రాండ్ విక్టరీ
కెప్టెన్ లోక్రన్ టకర్ (51 బాల్స్‌లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 94), గారెత్ డెలానీ (30 బాల్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 56) దంచికొట్టడంతో కొలంబోలో జరిగిన గ్రూప్–బి మ్యాచ్‌లో ఐర్లాండ్ 96 రన్స్ తేడాతో ఒమన్‌ను చిత్తు చేసింది. తొలుత ఐరిష్ టీమ్ 20 ఓవర్లలో 235/5 స్కోరు చేసింది. జార్జ్ డాక్రెల్ (9 బాల్స్‌లో 5 సిక్సర్లతో 35 నాటౌట్) కూడా సత్తా చాటాడు. అనంతరం ఛేజింగ్‌లో ఒమన్ 18 ఓవర్లలో 139 రన్స్‌కే ఆలౌటైంది. ఆమిర్ కలీమ్ (50), హమ్మద్ మీర్జా (46) తప్ప మిగతా బ్యాటర్లు ఫెయిలయ్యారు. జోషువా లిటిల్ మూడు వికెట్లు పడగొట్టాడు. టకర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
