Bigg Boss: బిగ్ బాస్ ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఎవరో తెలిసిపోయింది.. వారం రోజుల్లో ఈ కంటెస్టెంట్ సంపాదన ఎంతంటే?

Bigg Boss: బిగ్ బాస్ ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఎవరో తెలిసిపోయింది.. వారం రోజుల్లో ఈ కంటెస్టెంట్ సంపాదన ఎంతంటే?

బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ ఉత్కంఠగా సాగుతుంది. నాగ్ వేసే ప్రశ్నలతో, కంటెస్టెంట్స్ ఒకరికొకరు పోటీపడుతూ, గొడవలు పెట్టుకుంటూ వారమంతా కథ నడిపిస్తు వచ్చారు. అయితే, వీకెండ్లో మాత్రం ఆడియన్స్ వేసే ఓటింగ్స్తోనే తమ అసలైన ఆటతీరు కనిపిస్తుంది.

ఇవాళ ఆదివారం (సెప్టెంబర్ 14న) మొదటి ఎలిమినేషన్ డే. సో, కంటెస్టెంట్స్లో ఒకరిని హోస్ట్ నాగార్జున ఎలిమినేట్ చేయనున్నాడు. మరి ఈ వారం ఎంతమంది నామినేషన్లలో ఉన్నారు? డేంజర్ జోన్లో ఎవరున్నారనేది చూద్దాం. 

బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ సెప్టెంబర్ 7న స్టార్ట్ అయింది. ఈ క్రమంలో ఫస్ట్ వీక్ ఇవాళ షోతో కంప్లీట్ అవ్వనుంది. అయితే, ఈ వారం 9 మంది నామినేషన్లలో నిలిచారు. ఇందులో 8 మంది సెలబ్రిటీలు, ఓ కామనర్ ఉన్నారు. సెలబ్రిటీల్లో చూసుకుంటే.. కమెడియన్ సుమన్ శెట్టి, తనుజ, ఇమ్యాన్యుయెల్, సంజన గల్రానీ, రాము రాథోడ్, రీతూ చౌదరి, ఫ్లోరా సైనీ, శ్రేష్టి వర్మ నామినేట్ అయ్యారు. కామనర్లో డీమాన్ పవన్ ఈ లిస్ట్లో ఉన్నాడు.

అయితే, వీరిలో ఎవరు ఎలిమినేట్ అవ్వనున్నారనేది క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే, సోషల్ మీడియాలో ఆ సదరు ఎలిమినేట్ కంటెస్టెంట్ ఫోటో సైతం హల్ చల్ చేస్తుంది. లేటెస్ట్గా రిలీజ్ చేసిన ప్రోమో సైతం క్లారిటీ ఇచ్చేసిందనే విషయం తెలుస్తుంది. 

అంతేకాకుండా, ఈ వీకెండ్ ఓటింగ్ మొదలైన వెంటనే కొందరు కంటెస్టెంట్లు డేంజర్ జోన్‌లోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. వారిలో ముఖ్యంగా ఫ్లోరా సైనీ, శ్రేష్టి వర్మ తరుచూ తక్కువ ఓట్స్‌లో ఉండటం చూస్తూ వస్తున్నారు బిగ్ బాస్ ఆడియన్స్. అలాగే, ఇందులో ఫ్లోరా సైనీ సేఫ్ అవ్వగా శ్రేష్టి వర్మ మాత్రం ఎలిమినేట్ అయ్యారని టాక్ బయటకి వచ్చింది. దీనికి సంబంధించిన ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ షూటింగ్ శనివారం (సెప్టెంబర్ 13) నాడే జరిగిపోయింది.

ఈ క్రమంలో బిగ్ బాస్ తెలుగు 9 ఫస్ట్ వీక్ ఎలిమినేషన్‌ను ఇవాళ (సెప్టెంబర్ 14) రాత్రి ప్రసారం చేయనున్నారు. అయితే, కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మకు ఓట్లు తక్కువ రావడమే ఎలిమినేట్కు కారణం. ఎందుకంటే, ఈ ఫస్ట్ వీక్ తన ఆటతీరుతో పెద్దగా ఎవ్వర్నీ ఆకట్టుకోలేకపోయింది.

ఇదిలా ఉంటే.. శ్రేష్టి వర్మ ఈ వారం రోజులకు గానూ దాదాపుగా రూ. 2 లక్షల వరకు రెమ్యునరేషన్ కలెక్ట్ చేసినట్లు టాక్. అంటే, శ్రేష్టి వర్మ రోజుకు సుమారు రూ 28,571 రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. అయితే, మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే.. ఈ అమౌంట్ తక్కువని చెబుతున్నారు బిగ్ బాస్ ఆడియన్స్.