తెలంగాణలోని ఈ జిల్లాల్లో మరో రెండు రోజులు భారీ వర్షాలు

తెలంగాణలోని ఈ జిల్లాల్లో  మరో రెండు రోజులు భారీ వర్షాలు

గత మూడు నాలుగు రోజుల నుంచి  తెలంగాణ వ్యాప్తంగా   పలు జిల్లాల్లో  వర్షాలు పడుతున్నాయి.   ఇంకా  మరో  రెండు  రోజులు భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.   ఈ రోజు భారీ, అతి భారీ వర్షాలు పడనున్నాయని  ఈ రోజు 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్,   12 జిల్లాలకు ఎల్లో అలర్ట్  జారీ చేసింది వాతావరణ శాఖ.

ఆదిలాబాద్, నిర్మల్, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాల్లో  ఈ రోజు అతి భారీ వర్షాలు   కురిసే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ

►ALSO READ | విడాకుల కేసుల్లో ట్విస్ట్: లోక్ అదాలత్‎లో మళ్లీ కలిసిన భార్యాభర్తలు: పూల దండలతో ఒక్కటి చేసిన జడ్జి

కొమురం భీం అసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్,  కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్  జిల్లాల్లో  భారీ వర్షాలు  కురిసే అవకాశంతో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.  సెప్టెంబర్ 14న  కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు  కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.