తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా

తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా

తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్ తెచ్చింది కాంగ్రెస్, బీఅర్ఎస్ పార్టీలేనని.. ఆ రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ , బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ తెస్తామన్నారు. ఏప్రిల్ 25వ తేదీ గురువారం లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు.

అయోధ్యలో రామ మందిర్ నిర్మాణం చేయడం....కాంగ్రెస్ కు ఇష్టం లేదని.. మందిరం నిర్మాణం చేయకుండా కేసులు వేసిందని అమిత్ షా విమర్శించారు. మోదీ కేసులు గెలిచి రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేసి బలరాముడిని ప్రాణప్రతిష్ఠ చేశారని చెప్పారు. జమ్మూకాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు చేసి.. 70 ఏండ్ల సమస్యను పరిష్కరించామని తెలిపారు. బీఅర్ఎస్, కాంగ్రెస్ రెండు ఒకటేనని.. ఈ దేశాన్ని బ్రష్టు పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. 

Also Read:కాళేశ్వరం విచారణకు అవసరమైతే కేసీఆర్ను పిలుస్తాం

దేశంలో అవినీతి ప్రోత్సహించాయని...అది కాళేశ్వరం కావచ్చు.. ఇంకోటి కావచ్చునన్నారు హోంమంత్రి. మిత్రులారా చెప్పండి.. తెలంగాణ విమోచన దినోత్సవం చేయాలా? వద్దా? అని ప్రజలనుద్దేశించి అన్నారు. తెలంగాణ అభివృద్ధి ఒక బీజేపీతో మాత్రమే సాధ్యమవుతుందని చెప్పారాయన. మెదక్ లో బీజేపీ పువ్వు వికసింపచేయాలని...ఎంపీగా  రఘునందన్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని అమిత్ షా కోరారు.