యాదగిరిగుట్ట  నర్సన్న హుండీ ఆదాయం రూ.4.03 కోట్లు

యాదగిరిగుట్ట  నర్సన్న హుండీ ఆదాయం రూ.4.03 కోట్లు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం హుండీలను ఆలయ అధికారులు మంగళవారం లెక్కించారు. 49 రోజులుగా భక్తులు స్వామివారి హుండీలలో సమర్పించిన కానుకలను మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కొండ కింద ఉన్న వ్రత మండప హాల్ లో కౌంట్ చేశారు. ఈ లెక్కింపులో 49 రోజులుగా హుండీలలో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా ఆలయానికి రూ.4,03,02,821 ఆదాయం సమకూరింది.

136 గ్రాముల బంగారం, 3 కిలోల 600 గ్రాముల వెండి సైతం సమకూరిందని ఆలయ ఈవో భవానీ శంకర్ తెలిపారు. విదేశీ కరెన్సీ సైతం భక్తులు హుండీలలో భారీగా సమర్పించారు. అమెరికా 1605 డాలర్లు, సింగపూర్ 71, దిరమ్స్ 95, ఇంగ్లాండ్ 165 పౌండ్లు, కెనడా 25 డాలర్లు, యూరప్ 40, చైనా 110, రియాల్ 39, ఒమస్ 100, కువైట్ 2, జపాన్ 1000, థాయ్లాండ్ 140, ఆస్ట్రేలియా 225, మయన్మార్ 550, శ్రీలంక  2600, యుగాండా 2000, ఇండోనేషియా 5000, సౌతాఫ్రికా 110, నేపాల్ 20, భూటాన్ 15, పోలాండ్ 20 కరెన్సీ వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.