బాపూనగర్ ను దత్తత తీసుకున్న ఐ కేర్ ఫౌండేషన్ : ఉడు తల నరేశ్

బాపూనగర్ ను దత్తత తీసుకున్న ఐ కేర్ ఫౌండేషన్ : ఉడు తల నరేశ్

ఎడపల్లి, వెలుగు : మండలంలోని బాపునగర్ గ్రామాన్ని ఐ కేర్ ఫౌండేషన్ దత్తత తీసుకుంటున్నట్లు ఫౌండేషన్​ వ్యవస్థాపకుడు ఉడుతల నరేశ్​తెలిపారు. మంగళవారం  ఫౌండేషన్ బృందం  గ్రామ సర్పంచ్​ నగునూరి అనురాధ రాజశేఖర్, ప్రజలతో  కలిసి  గ్రామంలో పర్యటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు  ప్రజలందరికీ పరిశుభ్రత, పారిశుధ్యం తదితర కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.  మహిళా సాధికారిక కార్యక్రమాలు చేపడుతామని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.