రవాణా శాఖలో ఇక ఒకే రాష్ట్రం.. ఒకే పన్ను విధానం.. టూరిస్టు బస్సులపై మూడు రకాల పన్నుల రద్దుకు కసరత్తు

రవాణా శాఖలో ఇక ఒకే రాష్ట్రం.. ఒకే పన్ను విధానం.. టూరిస్టు బస్సులపై మూడు రకాల పన్నుల రద్దుకు కసరత్తు

హైదరాబాద్, వెలుగు: రవాణా శాఖలో 'ఒకే రాష్ట్రం.. ఒకే పన్ను' విధానాన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రస్తుతం టూరిస్టు బస్సులపై డిస్ట్రిక్ట్ టాక్స్, టూ డిస్ట్రిక్ట్స్ టాక్స్, స్టేట్ టాక్స్ పేరుతో మూడు రకాల పన్నులు ఉండడంతో యజమానులకు, అధికారులకు గందరగోళం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో యజమానులకు సమయం వృథా కాకుండా, అదనపు ఖర్చులు తగ్గించేందుకు ఈ మూడింటిని కలిపి 'ఒకే పన్ను'గా మార్చాలని నిర్ణయించారు.

గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసుల ఆధారంగా, ఈ విధానంపై శుక్రవారం టూరిస్టు బస్సు యజమానులతో రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, అదనపు కమిషనర్ రమేశ్, జేటీసీ చంద్రశేఖర్‌‌‌‌ గౌడ్ తదితర అధికారులు సమావేశమయ్యారు. కొత్త విధానంతో కలిగే ప్రయోజనాలను వివరించి యజమానుల అభిప్రాయాలను సేకరించారు. దీనిపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు.