రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు కొనసాగుతున్నాయి. పలువురు ప్రముఖులు,మంత్రులు,ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉదయం 9 గంటల వరకు సుమారు 15 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు అంచనా వేశారు అధికారులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీలో పోలింగ్ కొనసాగుతుండగా డబ్బుల కట్టలు కలకలం రేపుతున్నాయి. 22వ వార్డ కు చెందిన బీఆర్ఎస్ అభ్యర్థి బుర్ర రమాదేవికి చెందిన ఓ వ్యక్తి ఓటర్ డబ్బు పంచేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకునేందకు ప్రయత్నించారు. పోలీసులను చూసి డబ్బు వదిలేసి పరారయ్యాడు. పోలీసులు అతడిని వెంబడించి పట్టుకున్నారు. సుమారు లక్ష రూపాయల డబ్బు స్వాధీనం చేసుకొని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. భూపాలపల్లి మున్సిపాలిటీలో ఉదయం 9 గంటల వరకు 12.0శాతం పోలింగ్ నమోదయ్యింది.
