బాల్కొండ, వెలుగు : ట్రాఫిక్ చలాన్లు తప్పించుకునేందుకు బైక్ కు ఫేక్ నంబర్ ప్లేట్ అమర్చుకున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శైలేందర్ మంగళవారం తెలిపారు.
బాల్కొండ కు చెందిన తౌటు రాజు తన ఫ్యాషన్ ప్రో బైక్ పై తిరుగుతుండగా వాహనాల తనిఖీ సమయంలో పట్టుకున్నట్లు చెప్పారు. ఉద్దేశపూర్వకంగా నకిలీ నంబర్ అమర్చుకున్నట్లు విచారణలో తేలిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని పేర్కొన్నారు
