జడ్చర్ల పట్టణంలో రూ. 26,500 కాజేసిన సైబర్ నేరగాళ్లు

జడ్చర్ల పట్టణంలో రూ. 26,500 కాజేసిన సైబర్ నేరగాళ్లు
  •     తండ్రికి స్కూటీ ఇప్పిస్తానని ఆశ చూపి మోసం చేసిన నిందితులు 

 జడ్చర్ల, వెలుగు : ​ మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. బాదేపల్లికి చెందిన మామిండ్ల రాఘవేందర్ గౌడ్ తండ్రి సత్యనారాయణ గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు స్కూటీ ఇప్పిస్తామంటూ నమ్మించి, విడతలవారీగా నగదు కాజేశారు.

గత నెల 29న గుర్తుతెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్ కాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నమ్మిన రాఘవేందర్ గౌడ్, నిందితుడు సూచించిన విధంగా తన ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతా నుంచి రూ. 11,000, తండ్రి ఖాతా నుంచి రూ. 15,500 మొత్తంగా రూ. 26,500 ఫోన్ పే చేశారు. అనంతరం స్కూటీ డెలివరీ గురించి ఆరా తీసేందుకు ప్రయత్నించగా, సదరు ఫోన్ నెంబర్ స్విచ్ఛాప్ రావడంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జడ్చర్ల టౌన్ సీఐ కమలాకర్ తెలిపారు.