మేడారం జాతరకు భక్తుల తరలింపులో తొర్రూరు డిపో కృషి అభినందనీయం : ఆర్టీసీ ఈడీ సాల్మన్ రాజు

మేడారం జాతరకు భక్తుల తరలింపులో తొర్రూరు డిపో కృషి అభినందనీయం : ఆర్టీసీ ఈడీ సాల్మన్ రాజు

తొర్రూరు, వెలుగు: మేడారం జాతరకు భక్తులను సురక్షితంగా తొర్రూరు ఆర్టీసీ బస్సులో తరలించడం అభినందనీయమని ఆర్టీసీ ఈడీ సాల్మన్ రాజు అన్నారు. సమ్మక్క సారలమ్మ మహా జాతరను విజయవంతం చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని వరంగల్ ఆర్ఎం విజయ భాను అధ్యక్షతన జడ్ఎస్ టీసీలో జరిగిన మేడారం సక్సెస్ మీట్ లో తొర్రూరు ఆర్టీసీ డిపో మేనేజర్ పద్మావతిని సన్మానించారు.

ఈ సందర్భంగా సాల్మన్​రాజు మాట్లాడుతూ తొర్రూరు డిపో నుంచి సుమారు 100 బస్సు సర్వీస్ లు నడిపి ఎలాంటి బ్రేక్ డౌన్, యాక్సిడెంట్లు లేకుండా డిపోకు అధిక ఈపీకే ను కేఎంపీఎల్ ను తీసుకురావడానికి డీఎం పద్మావతి కృషి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎం మహేశ్, ఎంఎఫ్ విజయ్ కుమార్, ఎస్టీఐ రజిత రెడ్డి, ఎస్డీఐ, ఏడీసీలు తదితరులు పాల్గొన్నారు.