- అడిషనల్ పీడీ శ్రీనివాస్ గౌడ్
తొగుట (రాయపోల్), వెలుగు: ఉపాధి హామీ పథకంలో అక్రమాలు జరిగితే సహించమని జిల్లా అడిషనల్ పీడీ శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. రాయపోల్ మండలంలో జరిగిన ఉపాధి పనుల సామాజిక తనిఖీ మంగళవారం మండల పరిషత్ ఆఫీస్వద్ద నిర్వహించారు. మండలంలో 230 పనులు చేపట్టగా అందులో రూ.3 కోట్ల 95 వేలు చెల్లించారు. మండలంలోని 19 పంచాయతీ పరిధిలో చేపట్టిన పనులు వివరాలను ప్రజాదర్బార్లో వెల్లడించారు.
కొన్ని గ్రామాల్లో ఎంబీ రికార్డు లేకుండానే బిల్లులు చెల్లించారని, పనులు చేయకుండా చేసినట్లు రికార్డులో కూలీల పేర్లు నమోదు చేశారని సామాజిక తనిఖీలో వెలుగులోకి వచ్చాయి. గ్రామాల్లో జాబ్ కార్డులు అప్డేట్ లేకపోవడంతో పాటు రికార్డులు అస్తవ్యస్తంగా ఉండడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అడిషనల్ పీడీ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండి కూలీలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే వేటు తప్పదన్నారు.
కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సతీశ్, అంబుజుమాడ్ ఖాజా అరీఫ్ అలీ, క్యూసీఓ సంతోష్ రెడ్డి. విజిలెన్స్ మేనేజర్ గణేశ్, స్టేట్ ప్రోగ్రాం మేనేజర్ అంజా గౌడ్, స్టేట్ రిసోర్స్ పర్సన్ అశోక్, ఎంపీడీవో శ్రీనివాస్, పీఆర్ ఏఈ రామ్ కుమార్, ఏపీఓ జనార్దన్, ఎంపీఓ శివకుమార్, సర్పంచులు నరసింహారెడ్డి, పర్వేజ్ అహ్మద్, మాసంపల్లి రాజు, సోమని నిర్మల, ఉశిగారి స్వామి, చిందం శశికాంత్, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
