డాక్టరు చీటీ ఉంటేనే లిక్కర్

డాక్టరు చీటీ ఉంటేనే లిక్కర్

లిక్కర్ కావాలంటే వైన్ షాపులకు వెళ్లాలి. డబ్బులు ఇచ్చి ఏ బ్రాండ్ కావాలో అది తీసుకోవాలి. ఎక్కడైనా ఇలాగే ఉంటుంది. అయితే కేరళలో పరిస్థితి మాత్రం దీనికి పూర్తిగా భిన్నం. ఎవరికి పడితే వారికి మద్యం అమ్మరు. లిక్కరు కావాలనుకునే వారు డాక్టర్ సర్టిఫికెట్ చూపిస్తేనే ఇస్తారు. ఈ నిర్ణయాన్ని ఆ రాష్ట్ర సీఎం పినరయ్ విజయన్ తీసుకున్నారు. దీనికి సంబంధించి ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ కు ఆదేశాలను జారీ చేశారు.

క‌రోనా వైరస్ కార‌ణంగా కేర‌ళ‌లో లిక్కర్ అమ్మ‌కాలు బంద్ చేశారు. మ‌ద్యానికి అల‌వాటైన చాలామంది మాన‌సిక రోగులుగా మారుతుంటే..మరికొందరు  ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నారు. మ‌ద్యానికి బానిస‌లైన‌వారు చ‌ప‌ల‌చిత్తానికి గుర‌వ‌డం స‌హ‌జ‌మైన ప‌రిణామంగా కేర‌ళ ప్ర‌భుత్వం గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు. ఇలాంటివారి త‌క్ష‌ణం ఆస్ప‌త్రుల్లో చేర్చుకుని ఉచిత వైద్యం అందించాల‌ని అడిక్ష‌న్ సెంట‌ర్ల‌ను ఆదేశించారు.

ఉన్న‌ట్టుండి మ‌ద్యాన్ని ఏమాత్రం అందుబాటులో లేకుండా చేయ‌డంతో ఇలాంటి అవాంఛ‌నీయ ప‌రిణామాలు త‌లెత్తుతున్నందున‌, లిక్క‌ర్‌ని ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చే అంశాన్ని కూడా ప‌రిశీలిస్తున్న‌ట్టు కేర‌ళ‌ సీఎం పినరయ్ విజయన్ తెలిపారు.