దరిద్రం.. యాక్ : రైళ్లల్లో నీటి కొరత.. టాయ్ లెట్ల కంపుతో.. ప్రయాణికులు అవస్థలు

దరిద్రం.. యాక్ : రైళ్లల్లో నీటి కొరత.. టాయ్ లెట్ల కంపుతో.. ప్రయాణికులు అవస్థలు

తమిళనాడు రైల్వే ప్రయాణికులకు తిప్పలు తప్పడంలేదు. ట్రైన్ జర్నీ చేసే ప్రయాణికులు అవసరాలకు వాడుకుందామనుకుంటే చుక్క నీరు కూడా రావడం లేదు. చెన్నై సెంట్రల్, కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ల నుంచి బయలుదేరిన రెండు మూడు గంటల్లోనే రైళ్లు నీళ్లు పూర్తిగా అయిపోయి నీటి కోరత ఏర్పడుతుంది. ప్యాసింజర్లు నానా ఇబ్బందులు పడుతున్నారు. ట్రైన్ లో టాయిలెట్లు కంపు కొడుతున్నాయి. 

తమిళనాడు లోని రైల్వే స్టేషన్లకు సోమ నుంచి గురువారాల వారకు రద్దీ తక్కువగా ఉంటుంది కాబట్టి 50శాతం అవసరాలకు నార్మల్ వాటర్ సప్లై చేస్తాయ్.  రద్దీ ఉండే శుక్ర, శని ఆది వారాల్లో 75 శాతం వాటర్ సప్లై చేస్తాయి. ప్రస్తుతం వేసవి సెలువులు, ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉందని రోజూ 100శాతం వాటర్ సప్లై చేసినా ఆ వాటర్ అవసరాలకు సరిపోవట్లే.. ఒక ట్రిప్‌కి ట్రైన్ లో 40వేల లీటర్ల వాటర్ తప్పని సరి అట. దక్షణ రైల్వే జంక్షన్ లో అదీ పరిస్థితి. వేసవిలో వాటర్ ప్రాబ్లమ్ ఎదుర్కొడానికి కృషి చేస్తున్నామని రైల్వే అధికారులు చెబుతున్నారు.