మద్యం  షాపులు ఓపెన్ చేసి ప్రజలను మళ్లీ కష్టాల్లోకి నెట్టారు: భట్టి

మద్యం  షాపులు ఓపెన్ చేసి ప్రజలను మళ్లీ కష్టాల్లోకి నెట్టారు: భట్టి

రాష్ట్రంలో కరోనాకు సంబంధించిన టెస్టులు ఎక్కువగా చేయించకుండా..వైరస్ లేదని సీఎం కేసీఆర్ చెప్పడం దారుణమన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ప్రశ్నించిన విపక్షాల నేతలను బఫూన్లు, బేవర్స్, అజ్ఞానులు అంటూ..సీఎం మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ప్రతిపక్షాలను గౌరవించకున్నా పర్వాలేదు….కనీసం రాష్ట్ర ప్రజలను మోసం చేయకుండా ఉంటే మంచిదన్నారు.

సీఎం కేసీఆర్ తన అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని అప్పుల్లోకి తీస్కెళ్లారని ఆరోపించారు భట్టి. కరోన రాకముందే రాష్ట్రాన్ని అప్పుల్లో నెట్టి ఉద్యోగస్తులకు సాలరీలు కూడా ఇవ్వలేని పరిస్టతికీ తీసుకొచ్చారన్నారు. లాక్ డౌన్ సమయంలో మద్యం లేకపోవడంతో ప్రజలు మంచిగా ఉన్నారన్నారు. కానీ ఇప్పుడు మద్యం షాపులు ఓపెన్ చేసి కేసీఆర్ ప్రజలను మళ్లీ కష్టాల్లోకి నెట్టారన్నారు. పేద ప్రజలు గుడుంబా తాగి చనిపోతున్నారనే సాకుతో మద్యం షాపులు ఓపెన్ చేసి అధిక ధరలకు అమ్మడం ఏంటని ప్రశ్నించారు. ప్రతి పక్షంలో ఉన్నవారు లెక్కలు అడిగితే సన్నాసులు వెదవలు అనడం కేసీఆర్ కు చెల్లుబాటు అవుతుందన్నారు. అది మంచి పద్ధతి కాదన్నారు.

మరోవైపు  ధాన్యం కొనుగోలు ఇప్పుడు కొత్తగా వచ్చిందేమి కాదని… గతంలో ఐకెపి ల ద్వారా గత ప్రభుత్వాలు  కొనుగోలు చేశాయన్నారు భట్టి విక్రమార్క. అది కేసీఆర్ తెలుసుకోవాలని… మైకంలో ఉండి మాట్లాడడం సరి కాదని హితవు పలికారు. కరోనా తో ఓ ప్రక్క రాష్ట్రం ఇబ్బందులు ఎదుర్కుంటుంటే 21వేల కోట్ల రూపాయల టెండర్లు పిలిచింది నువ్వు కదా అని ప్రశ్నించారు.  కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల లో రైతులు ఎందుకు ధాన్యాన్ని తగలబెడుతున్నారో..ముందుగా అది తెలుసుకోమంటూ ప్రశ్నించారు. ఎలాంటి అభివృద్ది పనులు చేయకుండా ప్రశ్నించే వారి పై ఎదురు దాడి చేస్తూ, మీడియాని భయపెట్టి ,ప్రతి పక్షాల గొంతునొక్కి రాష్ట్రాన్ని సర్వనాశం చేస్తూ రాష్ట్రంలోఅతి పెద్ద బఫున్, అతి పెద్ద జోకర్ అని మా ముఖ్యమంత్రి ని అనడానికి సిగ్గు పడుతున్నానని అన్నారు భట్టి.