సిద్దిపేటలో రోడ్డును బాగుచేయాలని వరి నాట్లేసి నిరసన

సిద్దిపేటలో  రోడ్డును బాగుచేయాలని వరి నాట్లేసి నిరసన

సిద్దిపేట, వెలుగు :  రోడ్డు గుంతలమయమై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నా రిపేర్లు చేయడంలేదని స్థానికులు రోడ్డుపై గుంతల్లో నాట్లు వేసి నిరసన తెలిపిన ఘటన సిద్దిపేట పట్టణంలో మంగళవారం జరిగింది.  సిద్దిపేట మున్సిపల్ పరిధి 16 వ వార్డులో భారాఇమాం చౌరస్తా నుంచి ఎల్లమ్మ గుడికి వెళ్లే రోడ్డు పూర్తిగా గుంతల మయమైంది.

దీన్ని బాగుచేసే విషయంలో ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదు. ఇటీవల కురిసిన వర్షాలతో గుంతలు నీటితో నిండిపోవడంతో ఆగ్రహించిన స్థానికులు, బీఆర్ఎస్ నేతలు మంగళవారం ఆ గుంతల్లో వరి నాట్లు వేసి వినూత్న నిరసన తెలిపారు.  ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు మాట్లాడుతూ గుంతల రోడ్డుతో ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారని, ప్రభుత్వం, అధికారులు స్పందించి రోడ్డు ను బాగుచేయాలని, లేకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.