- ఈ నెల14తో మొత్తం 25 రోజులు బంద్
- బస్సులు నడవక నష్ట పోయామంటున్న ప్యాసింజర్స్
- వ్యాలిడిటీ పొడిగించాలని విజ్ఞప్తులు
ఆర్టీసీ బస్ పాస్ ల వ్యాలిడిటీ కొద్ది రోజుల్లోముగియనుంది. అయితేలాక్ డౌన్ తో ఇన్నాళ్లూ బస్సులు నడవక తాము నష్ట పోయామని.. పాస్ వ్యాలిడిటీ పొడిగించాలని ప్రయాణికులు కోరుతున్నారు. రాష్ట్రంలో జనతా కర్ఫ్యూ, లాక్ డౌన్‌తో మార్చి 22వ తేదీ నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కడం లేదు. 15 రోజులుగా బస్సులు నడవడంలేదు. ఈ నెల15వ తేదీ వరకు ఇదే పరిస్థితి కొనసాగనుంది. ఇలా మొత్తం 25 రోజులు బంద్ కానున్నాయి. ప్రస్తుతం డిపో నుంచి 5 బస్సులను మాత్రమే అత్యవసర సర్వీసుల కోసం ఉపయోగిస్తున్నారు. రాష్ట్రం లో వివిధ రకాల మంత్లీ బస్‌పాస్‌లు 8 లక్షల వరకు ఉన్నాయి. ఇందులో ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌లో నే దాదాపు3.5 లక్షల వరకు పాస్లు ఉన్నా యి. గ్రేటర్ హైదరాబాద్‌లో సిటీ ఆర్డినర్డీ బస్ పాస్‌కు నెలకు రూ. 890, ఎక్స్ ప్రెస్‌కు రూ. 990, మెట్రో డీలక్స్ కు రూ. 1500, ఏసీ బస్సులకు రూ. 2000 చొప్పున తీసుకుంటున్నా రు. స్టూడెంట్ బస్ పాస్‌లు కూడా వివిధ రకాలుగా ఉన్నాయి.
వ్యాలిడిటీ పొడిగిస్తరా..?
బస్‌పాస్ తీసుకున్న ప్రయాణికుడు వివిధ కారణాలతో ఉపయోగించుకోపోతే అతడిదే బాధ్యత అవుతుంది. పాస్ వాడుకున్నా , వాడుకోకున్నా నెల పూర్తవగానే తప్పనిసరిగా మరో పాస్ తీసు కోవాల్సిందే. అయితే ప్రస్తుతం ఆర్టీసీ బస్సులే నడవడంలేదు. దీంతో తమ 25 రోజుల బస్ పాస్‌వ్యాలిడిటీ వృథాగా పోతుందని ప్రయాణికులు అంటున్నారు. గతంలో మాత్రం ఆర్టీసీ బస్సులు ఏదైనా కారణాలతో ఆగిపోతే బస్‌పాస్ వ్యాలిడిటీ పొడిగించేవారని రిటైర్ ఆర్టీసీ అధికారులు అంటున్నారు. ‘ప్రస్తుతం బస్సులు నడవక సంస్థే పెద్దమొత్తంలో ఆదాయం కోల్పోయి.. తీవ్ర నష్టాల్లో ఉంది. ఇలాంటి టైమ్ లో మళ్లీ బస్‌పాస్‌ల వ్యాలిడిటీ పొడిగించడం కష్టమే’ అని ఓ ఉన్నతాధికారి చెప్పడం గమనార్హం.
