మళ్లీ వరసగా మూడు రోజులు సెలవు..

మళ్లీ వరసగా మూడు రోజులు సెలవు..

మళ్లీ సెలవులు వచ్చాయి.. వరసగా మూడు రోజులు.. మొన్ననే సంక్రాంతి హాలిడేస్ ఎంజాయ్ చేసిన జనం.. మళ్లీ మూడు రోజులు వరసగా సెలవులు రావటంతో.. వీకెండ్ ప్లానింగ్ లో బిజీ అయ్యారు. జనవరి 26వ తేదీ రిపబ్లిక్ డే పబ్లిక్ హాలిడే.. శుక్రవారం వచ్చింది. అదే విధంగా జనవరి 27వ తేదీ నాలుగో శనివారం.. ఈ రోజు కూడా హాలిడే.. ఇక జనవరి 28వ తేదీ ఆదివారం.. ఎటూ వీకెండ్ హాలిడే.. దీంతో వరసగా వచ్చిన మూడు రోజుల సెలవులతో టూర్ ప్లానింగ్స్ చేసుకుంటున్నారు జనం.

బ్యాంకులకు కూడా వరసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. అదే విధంగా కొన్ని స్కూల్స్ సైతం రెండు, నాలుగో శనివారాలు సెలవు ఇస్తుంది. ఈ క్రమంలోనే ఈసారి లాంగ్ వీకెండ్ హాలిడేస్ వచ్చాయి. సంక్రాంతి సెలవులకు సొంతూర్లకు వెళ్లి వచ్చిన జనం.. ఈ మూడు రోజుల సెలవులను మాత్రం విహార యాత్రలకు ప్లాన్ చేసుకుంటున్నారు. అదే విధంగా మూవీస్ కు వెళ్లాలని ఫిక్స్ అయ్యారు.