అంధుల ఆరాధ్య దైవం, బ్రెయిలీ లిపి సృష్టికర్త డా. లూయిస్ బ్రెయిలీ 214 వ జన్మదిన సందర్భంగా హైదరాబాద్ మలక్ పేటలోని దివ్యంగుల సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యాలయం వద్ద లూయిస్ బ్రెయిలీ పార్క్ లో 9 అడుగుల లూయిస్ బ్రెయిలి కాంస్య విగ్రహాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. ఆయనతో పాటు రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, మలక్ పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లూయిస్ బ్రెయిలీ జయంతిని అధికారకంగా నిర్వహించడంతో పాటు దివ్యాంగుల అభివృద్ధి, సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
దివ్యాంగుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి కార్పొరేషన్ ద్వారా లోన్స్ అందించడం వారి చదువులను ప్రోత్సహించడం ప్రభుత్వ బాధ్యతని మంత్రి కొప్పుల తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, దివ్యాంగులు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.