హైదరాబాద్ కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ (KPHB) పోలీస్ స్టేషన్ పరిధిలోని రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన ఒక వాటర్ ట్యాంకర్.. ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న అభినవ్ కుమార్ మిశ్రా అనే 25 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ట్యాంకర్ కింద పడటంతో తీవ్ర గాయాలైన అభినవ్ ప్రాణాలు గాలిలోనే కలిసిపోయాయి.
సమాచారం అందుకున్న కేపీహెచ్ బీ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

