స్టేషన్ ఘన్పూర్ లో ‘మెగా లెదర్ పార్క్’ ఏర్పాటు చేయాలి

స్టేషన్ ఘన్పూర్ లో ‘మెగా లెదర్ పార్క్’ ఏర్పాటు చేయాలి

జనగామ, వెలుగు: స్టేషన్​ ఘన్​పూర్​లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన మెగా లెదర్​ పార్క్​కు ఆమోదం తెలిపాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య కోరారు. రూల్​ 377 కింద లోక్​సభలో ఆమె మాట్లాడారు. స్టేషన్‌‌‌‌ ఘన్‌‌‌‌పూర్‌‌‌‌లో ప్రభుత్వ గుర్తించిన 120 ఎకరాల్లో తెలంగాణ స్టేట్‌‌‌‌ లెదర్‌‌‌‌ ఇండస్ట్రీస్‌‌‌‌ ప్రమోషన్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ ఆధ్వర్యంలో మెగా లెదర్‌‌‌‌ పార్క్‌‌‌‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదన పెండింగ్​లో ఉందని గుర్తు చేశారు. 

లెదర్‌‌‌‌ పరిశ్రమకు అవసరమైన ముడి పదార్థాల లభ్యతతో పాటు ఎఫ్‌‌‌‌డీడీఐ, నిఫ్ట్‌‌‌‌, గిల్ట్‌‌‌‌ వంటి సంస్థలు సహకరించడానికి అంగీకరించాయని చెప్పారు. ఈ పార్క్​కు కేంద్రం ఆమోదిస్తే ఎస్సీ వర్గాలకు చెందిన యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎంపీ తెలిపారు.