మరో ఏడాది వరకు ఎల్ నినో ముప్పు తప్పదా...భారత్ లో 16వేల మరణాలు తప్పవా..?

మరో ఏడాది వరకు ఎల్ నినో ముప్పు తప్పదా...భారత్ లో 16వేల మరణాలు తప్పవా..?

పసిఫిక్ మహాసముద్రంలో భూమధ్యరేఖ సమీప ప్రాంతాల్లో ఏర్పడిన సూపర్ ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినో పరిస్థితులతో ప్రపంచవ్యాప్తంగా ఎండల వేడిమి విపరీతంగా పెరగనుందని, లక్షలాది మంది చనిపోయే ప్రమాదం ఉందని రీసెర్చర్లు హెచ్చరించారు. ఏటా ఎండల తీవ్రత కారణంగా సంభవించే మరణాలకు అదనంగా ఈసారి 4,51,000 మంది మరణించే ముప్పు ఉందని ‘క్లైమెట్ ఇంపాక్ట్ ల్యాబ్’ రీసెర్చ్ సంస్థ నిపుణులు అంచనా వేశారు. భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సుమారు15,800 అదనపు మరణాలు సంభవించవచ్చని తెలిపారు. 

ఈ మేరకు సూపర్ ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినో కారణంగా ఆయా ప్రాంతాలపై పడే ప్రభావం, సంభవించే అదనపు మరణాలను అంచనా వేస్తూ వీరు ఒక నివేదికను విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు, ఆర్థిక వ్యవస్థలు, కమ్యూనిటీలను వాతావరణ మార్పులు, విపరీతమైన వాతావరణ పరిస్థితులు ఎలా ప్రభావితం చేస్తాయనే అంశాలపై క్లైమెట్ ఇంపాక్ట్ ల్యాబ్ అధ్యయనం చేస్తుంది. 

ప్రస్తుత నివేదిక తయారీ కోసం..1996 నుంచి 2025 వరకు ఆయా దేశాల్లో ఏటా ఎండల తీవ్రత వల్ల సంభవించే యావరేజ్ మరణాలను పరిశీలించారు. తర్వాత సూపర్ ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినో ప్రభావంతో ఈ యావరేజ్ మరణాలకు అదనంగా ఎన్ని మరణాలు సంభవించవచ్చన్నది అంచనా వేశారు. 

ఎల్ నినో ముప్పు 2027కూ పొడిగింపు:

ఎల్ నినో ఇంకా దాని గరిష్ట స్థాయికి చేరుకోలేదని.. అది మరింత బలపడుతుందని అంచనా వేస్తున్నట్లు ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) ఈ నెల 3న తెలిపింది. నవంబర్ నుంచి -డిసెంబర్ మధ్య ఇది గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని వెల్లడించింది. ఇది 2027 ఫిబ్రవరి వరకూ కొనసాగే అవకాశం దాదాపు 100 శాతం ఉంటుందని స్పష్టం చేసింది. 

అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (నోవా) ఇటీవలి అంచనా ప్రకారం.. పసిఫిక్ సముద్రం మధ్య ప్రాంతంలో ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే1.8 డిగ్రీ సెంటీగ్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఎక్కువగా ఉన్నాయి. తూర్పు భూమధ్యరేఖ పసిఫిక్ ప్రాంతంలో 3 డిగ్రీలకు మించిన వ్యత్యాసాలు కనిపించాయి. అందుకే ఈ ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నినో బలపడే అవకాశం 90 శాతంపైగా ఉందని ఆ సంస్థ తెలిపింది.