షుగర్ పేషెంట్లు డ్రై ఫ్రూట్స్ తినొచ్చా? తింటే రోజుకి ఎన్ని తినాలో తెలుసా?

 షుగర్ పేషెంట్లు డ్రై ఫ్రూట్స్ తినొచ్చా? తింటే రోజుకి ఎన్ని తినాలో తెలుసా?

డయాబెటిక్ పేషెంట్స్ డ్రై ఫ్రూట్స్ తినొచ్చా ?  ఒకవేళ తీనొచ్చంటే రోజుకి ఎన్ని డ్రై ఫ్రూట్స్ తినాలి ? తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగిపోతాయా ? ఏ డ్రై ఫ్రూట్స్ తినాలి, రోజుకి ఎంత మోతాదులో తీసుకోవాలి ? అనే సందేహాలు చాలామందిలో ఉంటాయి

స్వీట్స్ తినాలనే కోరికను కంట్రోల్ చేసుకుంటేనే, శరీరానికి కావాల్సిన పోషకాలు అందించడంలో కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ భేష్‌గా పనిచేస్తాయి. అయితే  ఫ్రెష్ ఫ్రూట్స్ ని  ఎండబెట్టి డ్రై ఫ్రూట్స్ తయారుచేస్తారు. ఆ ప్రాసెస్ వల్ల డ్రై ఫ్రూట్స్ లో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, నేచురల్ ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటాయి. తాజా పండ్లతో పోల్చితే డ్రై ఫ్రూట్స్ లోనే ఇవి ఎక్కువగా ఉంటాయి.

 దాంతో కొందరు ఎక్స్పర్ట్స్ డయాబెటిక్ పేషెంట్స్ డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల పోషకాలు అందుతాయి, తీపి తినాలనిపించే కోరిక తగ్గుతుందని చెబుతుంటారు. మరికొందరు మాత్రం డ్రై ఫ్రూట్స్ కి  బదులు గ్లైజమిక్ తక్కువగా ఉన్న ఫ్రూట్స్ తినడమే మేలు అంటుంటారు. కానీ, 'మెడ్ ఇండియా మెడికల్ రివ్వూ' చేసిన స్టడీ ప్రకారం డయాబెటిక్ పేషెంట్స్ గ్లైసమిక్ తక్కువగా ఉన్న డేట్స్, ఆప్రికాట్స్, కిస్మిస్ మాత్రమే తినాలి. ఇవి షుగర్ క్రేవింగ్స్ ని కంట్రోల్ చేస్తాయి. 'తినొచ్చన్నార'ని ఎక్కువ తినకూడదు. రోజుకి రెండు లేదా మూడు మాత్రమే తినాలని చెబుతున్నాయి రీసెర్చ్ లు.