ఆధ్యాత్మికం : ముక్తికి మార్గం.. ఆత్మతత్వం..భక్తి తరించేందుకు సూత్రం ఇదే..!

ఆధ్యాత్మికం : ముక్తికి మార్గం.. ఆత్మతత్వం..భక్తి తరించేందుకు సూత్రం ఇదే..!

కాటికి కాలు చాచిన వయసులోనూ బతుకుదెరువు కోసం వ్యాకరణ పాఠాలు వల్లె వేస్తున్న ఓ సంసార జీవివి చూసిన జగద్గురు శంకరాచార్యుడు ఆశ్చర్యావేదనలకు లోసయ్యాడు. అశువుగా భజగోవిందం భజగోవిందం అంటూ మేడిపండు లాంటి లోకం పోకడ గుట్టువిప్పి చూపించాడు. 

ముక్తిమార్గాన్ని బోధించాడు. తప్పటడుగులు వేస్తున్న బిడ్డను చూసి తండ్రి హెచ్చరించినట్టుగానే, ఆశామోహాల్లో పడి వెనకకు ప్రయాణిస్తున్న మనిషిని అప్రమత్తం చేశాడు. మూర్ఖుడా! అంటూ కఠినంగా సందేహానికి శ్రీకారం చుట్టాడు. అర్ధం చేసుకునేవాళ్లకు ఓ తమ్ముడా! అని ప్రేమతో చెప్పాడు. అడ్డదారుల్లో వెళ్తున్నవాళ్లను అసలు దారికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. చివరికి సమర్థుడైన గురువులా నీకేం భయం లేదు. నువ్వు తరించే మార్గం ఉంది!' అంటూ అభయమిచ్చాడు.

గురుచరణ కమలాలపై మిక్కిలి భక్తిగల ఓ సాధకుడా! ఈసంసార బంధనాల నుంచి వెంటనే ముక్తిని పొందుదువు.. గాక? నీ ఇంద్రియాలనూ, మనసునూ అదుపులో పెట్టినవాడవై నీహృదయంలోనే ఉన్న పరమాత్మని దర్శించెదవు గాక.. అంటూ ఆశీర్వదిస్తాడు శంకరాచార్యులు. శిష్యసమేతంగా గానం చేసిన' ద్వాదశ మంబరికా స్తోత్రం, చతుర్దశ మంజరికా స్తోత్రం" సారాన్నంతా శంకరాచార్యులు ఈ 'భజగోవిందం' ముగింపు శ్లోకంగా చెప్పాడు.

గురుభక్తి తరించే మార్గం

గురుచరణాలపై భక్తిప్రపత్తులతో మెలిగి సాధకుడు సులువుగా సంసార బంధాల నుంచి విముక్తి పొందుతాడని శంకరాచార్యులు అంటారు. శ్రీరామకృష్ణ పరమహంస, రమణమహర్షి వంటి గురువులు కూడా తమ శిష్యులని ధర్మం వైపు నడిపించారు. గురువులలో కెల్లా పరమగురువుని భగవంతుడితో సమానంగా చూస్తారు. అలాంటి గురువు పాదాలను నమ్ముకొని, శరణాగతితో ముందుకు పోతే లౌకిక బంధాలు వాటంత అవే వెళ్లిపోతాయి. 

ఒకసారి రామకృష్ణ పరమహంస తో ఓ భక్తుడు గృహస్థులకు భగవద్దర్శనం కలుగుతుందంటారా?? అని అడుగుతాడు. అప్పుడు ఆయన తప్పకుండా అందరికే ముక్తి కలుగుతుంది. గురువు ఉపదేశం అనుసరించి నడుచుకోవాలి. పెడదోవ పడితే తిరిగిరావడం చాలా కష్టం. ముక్తి కలగడానికి చాలాకాలం పడుతుంది. 

మనసులో భగవంతుడిని నిలుపుకొని సత్యకర్మలను చేస్తే ముక్తి లభిస్తుంది. ఒక వ్యక్తి గురువు రూపంలో వచ్చి ఆధ్యాత్మిక చైతన్యం కలిగిస్తున్నాడంటే, ఆసచ్చిదానందుడే ఈ రూపం ధరించాడని గ్రహించు. నిన్ను చేయి పట్టుకొని నడిపించే స్నేహితుడే లాంటివాడని అర్ధం చేసుకో అంటాడు.

ఆత్మతత్వ బోధకుడు

సత్ప్రవర్తన, భక్తి, ధ్యానం లాంటివి భగవంతుడి కృప పొందడానికి అవసరమైనవి. నిజమైన గురువులంతా వీటన్నింటిలో శిక్షణనిచ్చి లోకాన్ని చూపిస్తే ఆచార్యుడైన గురువు మనకు పరమతత్వాన్ని, ఆత్మతత్వాన్ని అనుగ్రహిస్తాడు. అలాంటి గురువులు సూచించే దారిలో జీవితాన్ని ఉద్ధరించుకోవాలి. అయితే, ఈ కాలంలో అంత జిజ్ఞాస కలిగిన శిష్యులు, అంత ఆధ్యాత్మిక శక్తి సంపన్నులైన గురువులు చాలా తక్కువ.  సంసార లంపటం మంచి మానసిక సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు ఈ కాలం మనిషి తనలో తానే నలిగిపోతున్నాడు.. 

వీళ్ల బలహీనతల్ని ఆపరాగ చేసుకొని చిలుకపలుకుల్లా నాలుగు రిలీఫ్ కలిగించే ముచ్చట్లు, ప్రవచనాలు చెప్తూ కొంతమంది గురువులుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇలాంటి గురుశిష్యులకు జ్ఞానం వంటబట్టదు. వంటబట్టినా జీవితానికి ఉపయోగపడదు.