ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఎయిర్ పోర్టు ప్రతిపాదిత అనుకుంట గ్రామానికి చెందిన భూనిర్వాసిత రైతులు బుధవారం ఆందోళన చేపట్టారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తాము వ్యవసాయంపైనే ఆధారపడ్డామని ఎకరానికి రూ.6కోట్లు పరిహారం ఇస్తే భూములు ఇస్తామని స్పష్టం చేశారు.
తమ గ్రామాన్ని ప్రభుత్వం దత్తత తీసుకొని, గ్రామాభివృద్ధికి రూ.50 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ రాజర్షి షాకు వినతిపత్రం అందజేశారు.
