పేరే మారింది.. భూసేకరణ తీరు మారలే.. ఫ్యూచర్ సిటీపై ప్రజాభిప్రాయ సేకరణ జ్యూరీ సభ్యుల ఆరోపణ

పేరే మారింది.. భూసేకరణ తీరు మారలే.. ఫ్యూచర్ సిటీపై ప్రజాభిప్రాయ సేకరణ జ్యూరీ సభ్యుల ఆరోపణ

బషీర్​బాగ్, వెలుగు: ఫార్మా సిటీ పేరును ఫ్యూచర్ సిటీగా మార్చినా భూసేకరణ విధానంలో ఎలాంటి మార్పు రాలేదని ప్రజాభిప్రాయ సేకరణ జ్యూరీ ఆరోపించింది. బుధవారం బషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాగ్ ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్లబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో జ్యూరీ సభ్యులు నివేదికను విడుదల చేశారు.

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తాటిపర్తిలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో మేడిపల్లి, నానక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నట్లు గుర్తించామన్నారు. గ్రామసభలు నిర్వహించకుండానే బలవంతపు భూసేకరణ, పంటల ధ్వంసం, ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ రికార్డుల మార్పులు కొనసాగుతున్నాయని ఆరోపించారు.

ఎన్నికల హామీ మేరకు ఫార్మా సిటీ ప్రాజెక్టును వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.   సభ్యులు వేమన వసంతలక్ష్మి, ప్రొఫెసర్ సుజాత సూరేపల్లి, ఎస్.జీవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్, టి.రఘునాథ్, వి.బాలరాజ్, డా.విజయ్ పాల్గొన్నారు.