భద్రాచలం: 11 కిలోల గంజాయి పట్టివేత

భద్రాచలం: 11 కిలోల గంజాయి పట్టివేత

భద్రాచలం, వెలుగు : భద్రాచలం ఆర్టీసీ బస్టాండులో బుధవారం రాత్రి పోలీసులు 11 కిలోల గంజాయిని పట్టుకున్నారు. వివేక్ విరాట్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 

ఛత్తీస్​గఢ్​ రాష్ట్రం సుక్మా జిల్లా మహాపారా గ్రామానికి చెందిన ఇతను ఒడిశాలోని కలిమెల ప్రాంతానికి చెందిన గంజాయి వ్యాపారి నితీశ్​కుమార్ నుంచి గంజాయిని తీసుకుని హైదరాబాదుకు తరలిస్తున్నాడు. పట్టుబడిన గంజాయి విలువ రూ.5,43,500లు ఉంటుందని సీఐ నాగరాజు తెలిపారు. అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించినట్లుగా ఆయన చెప్పారు.