పుష్కరాలలోపు ఘాట్ల నిర్మాణాలు పూర్తి చేయాలి..భద్రాచలం టెంపుల్ పనులను పరిశీలించిన కలెక్టర్, సబ్ కలెక్టర్

పుష్కరాలలోపు ఘాట్ల నిర్మాణాలు పూర్తి చేయాలి..భద్రాచలం టెంపుల్ పనులను పరిశీలించిన కలెక్టర్, సబ్ కలెక్టర్

 భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : గోదావరి పుష్కరాల ప్రారంభం లోపు పరివాహక ప్రాంతాల్లోని ఘాట్ల నిర్మాణాలను పూర్తి చేసేలా ఆఫీసర్లు ప్రణాళిక రూపొందించాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ అంకిత్ సూచించారు. 

శనివారం ఆయన భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధి పనులను సబ్‌‌‌‌‌‌‌‌కలెక్టర్ మృణాల్ శ్రేష్టతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులను పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణాలు సకాలంలో పూర్తయ్యేలా, నాణ్యతతో చేపట్టాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ నెల 24, 25, 26 తేదీల్లో గోదావరిలో వినాయక నిమజ్జనాలు జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు. 

డీజేలపై నిషేధం అమలు చేయాలని, ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌కు అంతరాయం లేకుండా ఊరేగింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. అనంతరం బూర్గంపహాడ్ మండలం అంజనాపురంలో జరుగుతున్న డిజిటల్ భూ సర్వే పనులను పరిశీలించి, రైతులు సర్వే సిబ్బందికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్పీ అరుణ్ కుమార్ పాల్గొన్నారు.