ఖమ్మం నగరంలోని కాల్వ ఒడ్డు మున్నేరు వద్ద తీగల వంతెన నిర్మాణం నేపథ్యంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక చప్టాపై నీరు ప్రవహించడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మంగళవారం అర్ధరాత్రి నుంచి చప్టాపై నుంచి నీరు పారుతోంది.
దీంతో ఖమ్మం–ఖమ్మం రూరల్ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వాహనాలు కరుణగిరి బైపాస్ మార్గం మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. తీగల వంతెన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
-వెలుగు, ఖమ్మం ఫొటోగ్రాఫర్
